జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ తన నెక్స్ట్ మూవీ ‘గుడ్ లక్ సఖి’లో షూటర్‌గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ట్రైలర్ జగపతి బాబుతో మొదలవుతుంది. భారతదేశం గర్వించదగ్గ అత్యుత్తమ షూటర్లను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆది పినిశెట్టి సఖి (కీర్తి సురేష్) అనే పల్లెటూరి అమ్మాయిని సూచిస్తాడు. ఊరిలో అందరూ ఆమెను దురదృష్టవంతురాలిగా చూస్తారు. జగపతి బాబు ఆమెకు శిక్షణ ఇచ్చి, సఖి ఫేట్‌ని ఎలా మార్చాడు? ఆమెను అదృష్టవంతురాలిగా ఎలా చేసాడు ? అనేది మనం పెద్ద స్క్రీన్‌లపై చూడాల్సిన కథ.
Read Also : సమంత లైఫ్ లో మ్యాజిక్… కొత్త పిక్ తో రివీల్ !!
ఇది తెలిసిన కథే అయినప్పటికీ సఖిగా కీర్తి సురేష్ భాష, కొంటె చర్యలు ఉన్న ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. సినిమాలో ఎమోషనల్ పార్ట్ హైలెట్ కానుందని తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సుధీర్ చంద్ర నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో రాహుల్ రామకృష్ణ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
