God Father Trailer: మంచోళ్ళందరూ మంచోళ్ళు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
God Father Trailer: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ హిట్ సినిమా లూసిఫర్ కు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. “మన స్టేట్ సీఎం.. పీకేఆర్ అకస్మిక మరణం.. మంచోళ్ళందరూ మంచోళ్ళు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనుక” అంటూ పూరి జగన్నాథ్ బేస్ వాయిస్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. ఇక నెక్స్ట్ సీఎం ఎవరు అని అనగానే ది మోస్ట్ డేంజరస్ మిస్టీరియస్ మ్యాన్ బ్రహ్మ అంటూ చిరు ఇంట్రడక్షన్ అదిరిపోయింది. ఇక రాజకీయ డైలాగ్ తో దుమారం రేపిన ఆ డైలాగ్ గాడ్ ఫాదర్ లోనీదే అని క్లారిటీ ఇచ్చేసాడు చిరు. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, నా నుంచి రాజకీయం దూరం కాలేదు అని జైల్లో చిరు చెప్పే డైలాగ్ కు థియేటర్లు చిరిగిపోవడం ఖాయమనిపిస్తోంది. ఇక అన్న అంటే ఇష్టం లేని పాత్రలో నయన్ ఎంతో పొందికగా కనిపించగా.. విలన్ గా సత్యదేవ్ ఒక రేంజ్ లో విలనిజాన్ని పండించాడు.
ఇక నా ముందు నువ్వెంత పిల్ల బచ్చా అంటూ సత్యదేవ్ కు చిరు ఇచ్చే స్వీట్ వార్నింగ్ అదిరిపోయింది. ఒక రాజకీయ పెద్ద చనిపోతే ఆ సీట్ కోసం కాచుకొని ఉన్న రాజకీయ నేతలు, వారి కుటుంబాన్ని రోడ్డు మీదకు ఈడ్చే ఇంటి అల్లుడును ఆ కుటుంబానికి రుణపడి ఉన్న ఒక వ్యక్తి ఎలా దారిలో పెట్టాడు అనేదే గాడ్ ఫాదర్ కథగా తెలుస్తోంది. ఇక ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది మాత్రం సల్మాన్ ఖాన్ ఎంట్రీ.. బడా భాయ్ ఏది చెప్తే అది చేసే ఛోటా భాయ్ పాత్రలో సల్లూ భాయ్ పిచ్చెక్కించాడు. చివరిలో సల్మాన్.. అతని వెనుక సింగంలా చిరు వస్తున్న షాట్అయితే మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందనే చెప్పాలి. ఇక చిరుకు అసిస్టెంట్ గా సునీల్ కనిపించగా.. పోలీస్ ఆఫీసర్ గా సముద్ర ఖని కనిపించారు. ఇక ముఖ్య పాత్రల్లో మురళీ శర్మ, బ్రహ్మజీ కనిపించి మెప్పించారు. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అరుపులే అని చెప్పొచ్చు. మొత్తానికి ట్రైలర్ తో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ గాడ్ ఫాదర్ ఎలా మెప్పిస్తాడా చూడాలంటే అక్టోబరు 5 వరకు ఆగాల్సిందే.
Also Read
ఈ విజయదశమి కి థియేటర్స్ లో కలుసుకుందాం.#GodFather coming on Vijayadasami.
Here's the #GodFatherTrailer
https://t.co/FScCbk1POF
#GodFatherOnOct5th @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @ActorSatyaDev @MusicThaman @ProducerNVP @KonidelaPro @saregamasouth— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2022
తాజావార్తలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!