Site icon NTV Telugu

Salaar Success Party: డైనోసర్ డైలాగ్ కు ఎలాగైతే న్యాయం చేశారయ్యా..

Prabhas

Prabhas

Salaar Success Party: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. కెజిఎఫ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న హోంబాలే సంస్థ.. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎన్నో వాయిదాల తరువాత డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ విజయాన్ని అందుకుంది. బాహుబలి తరువాత ప్రభాస్ కు ఇచ్చిన సినిమా అంటే సలార్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఇరవై నాలుగు రోజులలో దాని దేశీయ స్థూల కలెక్షన్ ₹ 476.5 కోట్లు మరియు ఓవర్సీస్ కలెక్షన్ మొత్తం ₹ 133.5 కోట్లు సాధించింది. ఈ విధంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్ ఇప్పుడు ₹ 610 కోట్లకు చేరుకుంది. ₹ 270 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రం 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో నాల్గవ ర్యాంక్‌ను ఆక్రమించింది. దీంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు.

Mahesh Babu Beedi: రిలాక్స్ బాయ్స్.. అది పొగాకు బీడీ కాదు, ఆయుర్వేద బీడీ అంట

మొన్నటికి మొన్న చిత్ర బృందం ఒక చిన్న సక్సెస్ పార్టీ చేసుకుంది. అందులో కేవలం ప్రభాస్, శృతి హాసన్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్, హోంబాలే మేకర్స్ ఉన్నారు. ఇక ఇప్పుడు హోంబాలే మేకర్స్.. టోటల్ సినిమా యూనిట్ మొత్తానికి పార్టీ ఎరేంజ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో గ్లింప్స్ ను మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియోకు సలార్ టీజర్ లో హైలైట్ గా నిలిచిన డైనోసర్ డైలాగ్ ను యాడ్ చేశారు. సినిమాలో ఈ డైలాగ్ లేదు అని అభిమానులు కొద్దిగా నిరాశపడిన విషయం తెల్సిందే. ఏయ్.. సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్.. Lion…Cheetah…Tiger… Elephant are Very Dangerousఅంటూ .. చిత్ర బృందంలోని నటులను చూపించి.. But Not in Jurassic Park… because there is a ‘డైనోసర్’ డైలాగ్ కు ప్రభాస్ ఎంట్రీ చూపిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏదిఏమైనా.. ఇలాగైనా ఈ డైలాగ్ కు న్యాయం చేశారు.. చాలు అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version