మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా రాబోతోంది ‘గుంటూరు కారం’. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని బ్యానర్ వారు నిర్మాణం వహిస్తున్నారు. రీసెంట్‌గా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ అండ్ మాస్ స్ట్రైక్ రిలీజ్ చేయగా.. ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. 24 గంటల్లో 25 మిలియన్ వ్యూస్ రాబట్టి.. పుష్ప2 రికార్డ్ బద్దలు కొట్టింది. టాలీవుడ్‌లో హైయెస్ట్ వ్యూస్ అందుకున్న వీడియోగా నిలిచింది. ఇక ఇప్పుడు 30 మిలియన్ వ్యూస్ మార్క్ చేరువలో ఉంది గుంటూరు కారం మాస్ స్ట్రైక్. దీంతో 30 మిలియన్స్ వ్యూస్ రాబట్టిన టాలీవుడ్ ఫస్ట్ ఎవర్ హీరోగా మహేష్ బాబు ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసినట్టే. అయితే ఈ మాస్ స్ట్రైక్‌కి రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నప్పటికీ.. అనుకున్నంత స్థాయిలో లైక్స్ రావడం లేదు.
ఈ విషయంలోనే మహేష్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఇకపోతే.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమాను.. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు మహేష్ బాబు. ఎందుకంటే.. నెక్స్ట్ దర్శక ధీరుడు రాజమౌళితో భారీ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చేయబోతున్నాడు. ఇప్పటి నుంచే జక్కన్న కోసం కసరత్తులు చేస్తున్నాడు మహేష్. ఈ ఏడాదిలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉండనుంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కానుకగా, జనవరి 13న గుంటూరు కారం సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా పై ఫుల్ ఫోకస్ చేయనున్నాడు మహేష్ బాబు.