ఈ వారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సెప్టెంబర్ 5న తెలుగు నుంచి రెండు సినిమాలు రిలీజ్ కాగా.. తమిళ్ నుంచి ఓ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయింది. మరి ఈ సినిమాల్లో ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంది అంటే? ఆ సినిమానే బెటర్ అనే టాక్ వినిపిస్తోంది. హరిహర వీరమల్లు నుంచి మధ్యలోనే తప్పుకున్న క్రిష్ జాగర్లమూడి.. అనుష్కతో చేసిన ‘ఘాటి’ సినిమా ఊచకోత అన్నట్టుగా థియేటర్లోకి వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క చేసిన సినిమా కావడంతో పాటు.. ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి హైప్ ఇచ్చింది. దీంతో.. ఘాటి అనుష్కకు మరో అరుంధతి అవుతుందని అన్నారు. ఫైనల్‌గా ఈ రోజు థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా పర్వాలేదనే టాక్ సొంతం చేసుకుంది. అనుష్క ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అని అంటున్నారు.
ఇక తెలుగు నుంచి వచ్చిన మరో సినిమా ‘లిటిల్ హార్ట్స్’. ‘హ్యాష్ ట్యాగ్ నైన్టీస్’ అనే సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న కంటెంట్ క్రియేటర్ మౌళి హీరోగా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్ శివాని హీరోయిన్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా రూపొందిన ఈ సినిమాని బన్నీ వాసు అండ్ ఫ్రెండ్స్ థియేటర్లోకి తీసుకొచ్చారు. రిలీజ్‌కి ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించిన ఈ సినిమాకు.. మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. లిటిల్ హార్ట్స్‌ను ఫ్యామిలితో కలిసి ఎంజాయ్ చేయొచ్చని అంటున్నారు. చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని ఇచ్చేలా లిటిల్ హార్ట్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇక శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్‌లో వచ్చిన ‘మదరాసి’ ఓ మోస్తరుగా ఉందని అంటున్నారు. మురుగదాస్‌కు సాలిడ్ కంబ్యాక్ కాదనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ వారం రిలీజ్ అయిన మూడు సినిమాల్లో.. లిటిల్ హార్ట్స్‌ను మాత్రం యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
