Site icon NTV Telugu

Bhola Shankar: మెగా ర్యాప్ ని రెడీ అవ్వండి బాయ్స్…

Bhola Shankar

Bhola Shankar

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా ‘భోళా శంకర్’. అజిత్ నటించిన వేదాళమ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ వారం రోజుల్లో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. చిరుకి చెల్లి పాత్రలో కీర్తి సురేష్, హీరోయిన్ గా తమన్నా నటిస్తున్న భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ లేట్ గా స్టార్ట్ అయ్యి సాలిడ్ గా జరుగుతున్నాయి. టీజర్, ట్రైలర్, భోళా మేనియా, పెళ్లి సాంగ్ భోళా శంకర్ సినిమాకి మంచి బజ్ ని జనరేట్ చేసాయి. భోళా శంకర్ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో చిరు చాలా యంగ్ గా, స్టైల్ గా కనిపించాడు. మెగా ఫాన్స్ చిరుని ఎలా చూడాలి అనుకుంటున్నారో అదే రేంజులో చూపించాడు మెహర్ రమేష్. దీంతో సినిమాపై మెగా అభిమానుల్లోనే కాదు రెగ్యులర్ మూవీ లవర్స్ లో కూడా అంచనాలు బాగా పెరిగాయి.

లేటెస్ట్ గా భోళా శంకర్ నుంచి ‘రేజ్ ఆఫ్ భోళా’ అనే రాప్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నాం, రెడీగా ఉండండి అంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు. టీజర్ లో వినిపించిన ర్యాప్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ర్యాప్ ని ఫుల్ సాంగ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ అనౌన్స్మెంట్ ఇస్తూ వదిలిన పోస్టర్ సూపర్బ్ గా ఉంది. ఈ సాంగ్ రిలీజ్ చేసి హైప్ మరింత పెంచేస్తే, ఆ తర్వాత ఆగస్టు 6న జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ తో భోళా శంకర్ సినిమాపై అంచనాలు పీక్ స్టేజ్ కి వెళ్లిపోతాయి. అప్పుడు ఆగస్టు 11న టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టొచ్చు. మరి సంక్రాంతికి వీరయ్యగా హిట్ కొట్టిన చిరు, ఇప్పుడు భోళా శంకర్ గా ఏ రేంజ్ సక్సస్ కొడతాడో చూడాలి.

Exit mobile version