యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర సలార్. హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుతున్న సంగతి తెల్సిందే. ఇక ఈ చిత్రం కోసం డార్లింగ్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డార్లింగ్ ఫ్యాన్స్ కి సలార్ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పనున్నారట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు. దీంతో మేకర్స్ ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ గ్లింప్స్ ని రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారట.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ 2 రిలీజ్ కి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక థియేటర్లో ఈ సినిమా రిలీజ్ కి ముందు సలార్ టీజర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్తలో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ వార్త నిజమైతే బావుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ స్పెయిన్ లో ఉన్న కారణంగా ఈ సినిమా షూటింగ్ కి కొద్దిగా గ్యాప్ ఇచ్చారని. ఆ గ్యాప్ లో ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 ప్రమోషన్స్ లో పాల్గొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి సలార్ టీజర్ ఎంతటి విధ్వంసం సృస్టించనుందో చూడాలి.
