జెనీలియా- రితేష్ దేశముఖ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ ఎవరు అంటే మొదట గుర్తొచ్చే జంట వీరు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జెనీలియా.. భర్త రితేష్ తో కలిసి వీడియోలను చేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక తాజాగా జెనీలియా షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో లో జెనీలియా రితేష్లిద్దరూ `నాచ్ నాచ్ నాచ్` అనే పాటకు డ్యాన్స్ చేస్తూ ఉంటారు.
మధ్యలో సాంగ్ స్పీడ్ గా వెళ్లిపోతుండడంతో రితేష్ ఇంకా ఆ స్టెప్ ని వేస్తూ ఉంటాడు.. జెనిలీయా మాత్రం ఆయాసంతో ఆగిపోయి, రితేష్ ని కూడా ఆగమని చెప్తోంది. అయినా వినకుండా రితేష్ నాచ్ నాచ్ స్టెప్ వేస్తూ ఉంటాడు. దీంతో కోపమొచ్చిన జెన్నీ భర్తను చితక్కొట్టుడు కొడుతోంది. మొత్తానికి సూపర్ ఫన్నీగా ఉన్న ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక వీరి కెరీర్ విషయానికొస్తే రితేష్ పలు సినిమాలతో బిజీగా ఉండగా.. జెనీలియా కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. త్వరలోనే ఆమె నటించిన సినిమా విడుదల కానుంది. మరో విషయం ఏంటంటే ఈ సినిమాను రితేష్ స్వయంగా నిర్మించడం. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో హహ హాసినీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
