Site icon NTV Telugu

చిరిగిన బట్టలతో నటి… ముంబై పోలీసులే కారణమట!

Gehana Vasisth Sensational Comments on Mumbai Police

‘గండి బాత్’ అనే వెబ్ సిరీస్‌తో పాటు ఇతర టీవీ షోలలో కన్పించిన నటి, మోడల్ గెహన వశిష్ట ముంబై పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. గేహన వసిస్త పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. రాజ్ కుంద్రా పోర్న్ ఫిల్మ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చిరిగిన బట్టలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ దానికి కారణం ముంబై పోలీసులే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. “పోలీసులు నాకు ఈ దుస్థితిని తెచ్చారు. నా బ్యాంక్ ఖాతాలన్నీ బ్లాక్ చేశారు. చేతిలో డబ్బు లేదు. నేను ఇంటికి కూడా వెళ్లలేను. ఎందుకంటే ఇంటికి వెళితే పోలీసులు నన్ను మళ్లీ అరెస్ట్ చేస్తారు. నా మొబైల్‌, ల్యాప్‌టాప్‌లను పోలీసులు తీసేసుకున్నారు. ఇంతకుముందు నేను బెయిల్ కోసం కారును తనఖా పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను కొంతమంది తెలియని వ్యక్తులతో నివసిస్తున్నాను. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిని కబ్జా చేశారు. న్యాయవాదికి చెల్లించాల్సిన డబ్బులు కూడా ఇతర దగ్గర అప్పుగా తీసుకుని ఇస్తున్నారు. ముంబై పోలీసులు ఇంతకన్నా ఏం చేస్తారు? మీకు ఇంకా సంతృప్తిగా అనిపించకపోతే నాపై తప్పుడు ఆరోపణలు చేయండి. ఏదో ఒక రోజు అంతా బయటకు వస్తుంది. నిజం బయట పడుతుంది. నా మొబైల్‌లో అంతా ఉంది. కానీ మీరు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. పర్వాలేదు… ఈ రోజు నాకు బ్యాడ్ టైం ఉండొచ్చు. రేపు మీకు కూడా ఇలాంటి టైం వస్తుంది” అంటూ సుదీర్ఘ పోస్టుతో తన బాధను వెళ్లగక్కింది.

Read Also : చిరు ఇంట్లో సెలెబ్రిటీల సందడి… ఆమె కోసమే స్పెషల్ పార్టీ !

ఫిబ్రవరిలోఅసభ్యకరమైన సినిమాలు తీసినందుకు, యాప్‌ల ద్వారా ప్రసారం చేసినందుకు గెహనను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు ఆమెను నాలుగు నెలల పాటు కస్టడీలో ఉంచారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై బయట ఉంది. రాజ్ కుంద్రా అరెస్ట్ తరువాత మరోసారి గెహన పేరు వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు విచారణ పేరుతో ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకుంది.

Exit mobile version