NTV Telugu Site icon

Bigg Boss 6: బుద్ధి బలం అంటే వీక్‌నెస్‌తో ఆడుకోవడమా? గీతూ ఇంకా మారదా?

Bigg Boss 6

Bigg Boss 6

Bigg Boss 6: బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్‌లో కంటెస్టెంట్ల వైఖరి ప్రేక్షకులకు అర్ధం కావడం లేదు. ఒక్కొక్కరు ఒక్కోలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈ వారం హౌస్‌లో బిగ్‌బాస్ మిషన్ పాజిబుల్ అనే కెప్టెన్సీ కంటెండెర్ల టాస్క్ ఇచ్చాడు. ఈ సందర్భంగా సభ్యులందరూ రెడ్, బ్లూ టీములుగా విడిపోయారు. గీతూ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమా, కీర్తి రెడ్ టీమ్‌గా ఏర్పడ్డారు. ఆదిరెడ్డి, బాలాదిత్య, రాజ్, ఇనయా, వాసంతి, మెరీనా, రోహిత్ బ్లూ టీమ్‌లో ఉన్నారు. ఈ టాస్కులో భాగంగా సభ్యుల భుజాలపై ఉన్న నాలుగు స్ట్రిప్పులను లాగేస్తే అతడు చనిపోయినట్టే. దీంతో ఒకరు మీద ఒకరు పడి స్ట్రిప్పులు లాగుకున్నారు. ఈ టాస్కులో తొలుత ఫైమా, తరువాత బాలాదిత్య అవుట్ అయ్యారు. అయితే ఈ టాస్కులో భుజబలంతో పాటు బుద్ధిబలం కూడా చూపించాలని బిగ్‌బాస్ సూచించాడు. కానీ గీతూ అండ్ కో బుద్ధిబలం అంటే ఎదుటివారి వీక్‌నెస్‌పైనే ఆడుకోవడం మొదలుపెట్టారు.

Read Also: Hyderabad: పార్కులకు వెళ్లే లవర్స్‌కు చేదువార్త.. ఆ పని చేస్తే దొరికిపోతారు

ఈ సీజన్‌లో హౌస్‌లో ఉండేవారిలో బాలాదిత్యకు స్మోకింగ్ అంటే ఎంత వ్యామోహమో గత వారాల్లోనే గమనించాం. ఇప్పటికే గీతూ ఒకసారి దొంగాట ఆడి బాలాదిత్యను స్మోకింగ్‌కు దూరం చేసింది. తాజా టాస్కులోనూ గీతూ అదే దారి ఎంచుకుంది. కన్నింగ్‌గా బాలాదిత్య వీక్‌నెస్‌పైనే దెబ్బకొట్టింది. శ్రీహాన్, శ్రీసత్య సహాయంతో బాలాదిత్య సిగరెట్లు, లైటర్ దొంగిలించి అతడిని ఏడిపించింది. దీంతో తన ఒక్కడి కోసం టీమ్ మొత్తాన్ని ఇబ్బందుల్లో పెట్టడం ఇష్టలేదని, బతిమిలాడుతున్నానని.. ఈ విషయం సీరియస్ చేయకుండా తన సిగరెట్లను ఇచ్చేయాలని గీతూను బాలాదిత్య హెచ్చరిస్తాడు. గీతూను చెల్లెలిలా భావించినందుకు రిగ్రెట్ అవుతున్నానంటూ ఫీలవుతాడు. అయితే విచిత్రం ఏంటంటే.. ఇతరుల వీక్నెస్‌తో ఆడుకోవద్దని గతవారం నాగార్జున హెచ్చరించినా గీతూలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పైగా ఆదిరెడ్డి దగ్గరకు వెళ్లి గీతూ కన్నీళ్లు పెట్టుకుని దొంగ ఏడుపులు ఏడ్చింది. మరోవైపు ఆదిత్యను హౌస్ సభ్యులు సముదాయిస్తున్నారు. హౌస్‌లో కన్నింగ్ గేమ్ ఆడుతున్న గీతూ, శ్రీహాన్, శ్రీసత్య విషయంలో ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో ఈ వారం వేచి చూడాల్సి ఉంది. శ్రీహాన్ నామినేషన్స్‌లో లేకపోవడం అతడికి ప్లస్ పాయింట్‌గా మారింది.