గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ ని వరదలు ముంచెత్తుతున్నాయి. నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో వరద ఉధృతికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే వరద బాధితుల కోసం పలువురు తమవంతు సాయం చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తిరుపతి వరద బాధితులకు ఆపన్న హస్తం అందించింది. వరద బాధితుల సహాయార్థం 10 లక్షలు.. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేసింది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు తమవంతు సహాయం చేస్తున్నట్లు తెలిపింది.
వరద బాధితులకు గీతా ఆర్ట్స్ సాయం..

geeta arts