NTV Telugu Site icon

Gayathri Raghuram: అయ్యో.. బాపు బొమ్మ ఏంటీ .. ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది

Gr

Gr

Gayathri Raghuram: గాయత్రీ రఘురామ్.. ఈ పేరు ఇప్పటివారికి గుర్తులేకపోవచ్చు. కానీ, అప్పట్లో ఈ భామ చాలా మంచి సినిమాలు తీసింది. రేపల్లెలో రాధ, మా బాపుబొమ్మకు పెళ్ళంట అనే సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యింది. ప్రముఖ నృత్య దర్శకుడు రఘురామ్ కుమార్తెగా ఆమె ఇండస్ట్రీకి పరిచయమైంది. కోలీవుడ్ లో మంచి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ భామ.. తెలుగులో పరిచయమై అచ్చ తెలుగు ఆడపడుచులా అందరి మనసులను దోచుకుంది. అయితే నటన పరంగా ఆమెకు మంచి మార్కులే పడినా.. విజయాలు మాత్రం అందుకోలేకపోయింది. ఇక హీరోయిన్ గానే కాకుండాడ్యాన్స్ కంపోజర్ గా కూడా గాయత్రీ పేరు తెచ్చుకుంది. 2006 లో కాలిఫోర్నియాకి చెందిన దీపక్ చంద్రశేఖర్ ని పెళ్లాడిన ఆమె కొన్ని విబేధాల వలన 2010 లో భర్త నుంచి విడాకులు తీసుకుంది.

Animal: బాలీవుడ్ కు ధమ్ మసాలా బిర్యానీ రుచి చూపించన్నా..

ఇక సినిమాలను పక్కకు నెట్టి 2014 లో బీజేపీలో చేరిన ఆమె ఈమధ్యనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుతం గాయత్రీ ఒక డ్యాన్స్ స్కూల్ ను నడుపుతూ బిజీగా మారింది. అప్పుడంటే సోషల్ మీడియా లేదు కాబట్టి.. ఎవరు ఎక్కడ ఉండేవారో.. ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కష్టం అయ్యేది. కానీ, ఇప్పుడు అలా కాదు.. సోషల్ మీడియాలో పేరు కొడితే .. వారి బయోగ్రఫీ మొత్తం వచ్చేస్తుంది. అయితే తాజాగా గాయత్రీ న్యూ లుక్ వైరల్ గా మారింది. జుట్టు మొత్తాన్ని కత్తిరించేసి.. వైట్ హెయిర్ తో కొద్దిగా బరువుపెరిగి గాయత్రీ దర్శనమిచ్చింది. దీంతో ఆమెను గుర్తుపట్టడం చాలా కష్టంగా మారింది. సడెన్ గా చూసి ఎవరీమె అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం గాయత్రీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments