Gayapadda Simham Exclusive: హ్యాపెనింగ్ హీరో ఎక్స్టెండెడ్ క్యామియో.. మరో సర్ప్రైజ్ కూడా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో ఒక క్రేజీ అప్‌డేట్ తెగ హల్చల్ చేస్తోంది. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘గాయపడ్డ సింహం’. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఒక ‘మెగా’ సర్ప్రైజ్‌ను చిత్రబృందం అత్యంత రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్‌కు చెందిన ఒక హ్యాపెనింగ్ హీరో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్. అది కూడా ఏదో మెరుపుతీగలా వచ్చి వెళ్లే అతిథి పాత్ర కాదు.. ఏకంగా 40 నిమిషాల పాటు సాగే అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో ఆయన మెరవబోతున్నారట. సినిమా మలుపు తిరిగే కీలక సన్నివేశాల్లో ఈ హీరో ఎంట్రీ ఇస్తారని సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన మరో సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే.. సదరు స్టార్ హీరోతో పాటు ఆయన తండ్రి* కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. విశేషమేమిటంటే, ఆయనకు ఇదే డెబ్యూ (తొలి) సినిమా. వెండితెరపై తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించడం ఇదే తొలిసారి. సాధారణంగా ఇలాంటి పెద్ద అప్‌డేట్స్ ఉంటే సినిమా ప్రమోషన్ల కోసం ముందే వాడేసుకుంటారు. కానీ ‘గాయపడ్డ సింహం’ టీం మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడింది. థియేటర్లలో ప్రేక్షకులకు అసలైన థ్రిల్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో ఆ “మిస్టరీ హీరో” ఎవరో తెలిస్తే బాక్సాఫీస్ దగ్గర కాస్త గట్టిగానే వర్కౌట్ కావడం ఖాయమనిపిస్తోంది. మరి ఆ హీరో ఎవరనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!
Also Read
తాజావార్తలు
-
Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
-
Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
-
Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
-
SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్‌కు కీలక సమరం!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
ట్రెండింగ్
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!