Drugs Case: డ్రగ్స్ కేసులో తెర మీదకు హీరో పేరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gave Rs 7 lakh to Udhayanidhi Stalin Says arrested Producer Jaffer Sadiq: శనివారం నాడు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్టు చేసిన తమిళ సినీ నిర్మాత జాఫర్ సాదిక్ , డిఎంకె మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు రూ. 7 లక్షలు ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థకు తెలిపినట్లు తెలుస్తోంది. 2,000 కోట్ల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో సాదిక్‌ను అరెస్టు చేశారు. గత ఏడాది వరదల సమయంలో సాయం చేసేందుకు ఉదయనిధి స్టాలిన్‌కు రూ. 5 లక్షలు ఇచ్చానని, మిగిలిన రూ. 2 లక్షలు పార్టీకి నిధులుగా ఇచ్చానని సాదిక్ అధికారులకు తెలిపినట్లు సమాచారం. జాఫర్ సాదిక్ ఉదయనిధి స్టాలిన్‌కు ఇచ్చిన డబ్బు అతను మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో సంపాదించిన డబ్బు అని ఎన్‌సిబి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మనీలాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాస్తున్నట్లు ఎన్‌సిబి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) జ్ఞానేశ్వర్ సింగ్ మీడియాకి తెలిపారు. అంతేకాక NCB ఇతర ఏజెన్సీలతో కూడా టచ్‌లో ఉందని సింగ్ తెలిపారు.
Dogs attack: బాలికపై కుక్కలు మూకుమ్మడి దాడి.. వీడియో వైరల్
Also Read
- NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
- Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
- Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
- Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. ప్రభాస్‌తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
ఇక జాఫర్ సాదిక్ పేరు మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌తో ఉన్న లింక్‌లను ఎన్‌సిబి ప్రస్తావించినందున ఇటీవల డిఎంకె నుంచి జాఫర్ బహిష్కరించబడ్డారు. బహిష్కరణకు ముందు డీఎంకే ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెన్నై వెస్ట్ డిప్యూటీ ఆర్గనైజర్‌గా ఉన్నానని సాదిక్ ఎన్‌సీబీకి చెప్పాడని జ్ఞానేశ్వర్ సింగ్ పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది. ఫిబ్రవరిలో ఈ కేసులో ఎన్‌సిబి ఢిల్లీలో దాడులు నిర్వహించడంతో నిర్మాత “అజ్ఞాతంలోకి” వెళ్లి, కస్టడీలోకి తీసుకునే ముందు వరకు చెన్నై నుండి తిరువనంతపురం, ముంబై, పూణే, అహ్మదాబాద్ మరియు జైపూర్‌లను చుట్టివచ్చారు. ఇక ఈ అక్రమ మాదకద్రవ్యాల అక్రమ రవాణా కార్యకలాపాల ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదించానని, ఆ డబ్బును సినిమా నిర్మాణం, హాస్పిటాలిటీ మొదలైన పరిశ్రమల్లో చట్టబద్ధమైన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్లు సాదిక్ వెల్లడించినట్లు NCB పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి గతంలో ఢిల్లీలో ముగ్గురు వ్యక్తులను ఎన్‌సీబీ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 50 కిలోల సూడోపెడ్రిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్‌మన్ గిల్ వరకు ఇలా..
-
Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
-
Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులపై చర్యలకు వెనక్కి తగ్గిన బార్ కౌన్సిల్..
-
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!