Site icon NTV Telugu

Drugs Case: డ్రగ్స్ కేసులో తెర మీదకు హీరో పేరు?

Udayanidhi Stalin

Udayanidhi Stalin

Gave Rs 7 lakh to Udhayanidhi Stalin Says arrested Producer Jaffer Sadiq: శనివారం నాడు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్టు చేసిన తమిళ సినీ నిర్మాత జాఫర్ సాదిక్ , డిఎంకె మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు రూ. 7 లక్షలు ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థకు తెలిపినట్లు తెలుస్తోంది. 2,000 కోట్ల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో సాదిక్‌ను అరెస్టు చేశారు. గత ఏడాది వరదల సమయంలో సాయం చేసేందుకు ఉదయనిధి స్టాలిన్‌కు రూ. 5 లక్షలు ఇచ్చానని, మిగిలిన రూ. 2 లక్షలు పార్టీకి నిధులుగా ఇచ్చానని సాదిక్ అధికారులకు తెలిపినట్లు సమాచారం. జాఫర్ సాదిక్ ఉదయనిధి స్టాలిన్‌కు ఇచ్చిన డబ్బు అతను మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో సంపాదించిన డబ్బు అని ఎన్‌సిబి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మనీలాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాస్తున్నట్లు ఎన్‌సిబి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) జ్ఞానేశ్వర్ సింగ్ మీడియాకి తెలిపారు. అంతేకాక NCB ఇతర ఏజెన్సీలతో కూడా టచ్‌లో ఉందని సింగ్ తెలిపారు.

Dogs attack: బాలికపై కుక్కలు మూకుమ్మడి దాడి.. వీడియో వైరల్

ఇక జాఫర్ సాదిక్ పేరు మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌తో ఉన్న లింక్‌లను ఎన్‌సిబి ప్రస్తావించినందున ఇటీవల డిఎంకె నుంచి జాఫర్ బహిష్కరించబడ్డారు. బహిష్కరణకు ముందు డీఎంకే ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెన్నై వెస్ట్ డిప్యూటీ ఆర్గనైజర్‌గా ఉన్నానని సాదిక్ ఎన్‌సీబీకి చెప్పాడని జ్ఞానేశ్వర్ సింగ్ పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది. ఫిబ్రవరిలో ఈ కేసులో ఎన్‌సిబి ఢిల్లీలో దాడులు నిర్వహించడంతో నిర్మాత “అజ్ఞాతంలోకి” వెళ్లి, కస్టడీలోకి తీసుకునే ముందు వరకు చెన్నై నుండి తిరువనంతపురం, ముంబై, పూణే, అహ్మదాబాద్ మరియు జైపూర్‌లను చుట్టివచ్చారు. ఇక ఈ అక్రమ మాదకద్రవ్యాల అక్రమ రవాణా కార్యకలాపాల ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదించానని, ఆ డబ్బును సినిమా నిర్మాణం, హాస్పిటాలిటీ మొదలైన పరిశ్రమల్లో చట్టబద్ధమైన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్లు సాదిక్ వెల్లడించినట్లు NCB పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి గతంలో ఢిల్లీలో ముగ్గురు వ్యక్తులను ఎన్‌సీబీ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 50 కిలోల సూడోపెడ్రిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version