Gouthami : సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హీరో ధర్మ, రీతూ చౌదరి వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ధర్మ భార్య గౌతమి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన ఆరోపణలు చేస్తోంది. తన భర్త, రీతూ చౌదరి అర్ధరాత్రి ఫ్లాట్ లోకి వెళ్తున్న వీడియోలను లీక్ చేసింది. తాజాగా ఎన్టీవీతో మాట్లాడుతూ.. ధర్మ వాళ్ల ఫాదర్ మాట్లాడుతూ.. నాపై చాలా నిందలు వేశారు. నేను కోట్లు అడిగానని చెప్పారు. అందులో అసలు నిజమే లేదు. నాకు ఉన్నది చాలు. వాళ్ల డబ్బు నాకు అక్కర్లేదు. నాకు పెళ్లికి ముందే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పారు.
Read Also : Gouthami : ప్రూఫ్ చూపిస్తే రాళ్లతో కొట్టించుకుని చస్తా.. గౌతమి చౌదరి సవాల్..
పెళ్లికి ముందు ఉంటే తప్పేంటి. పెళ్లి అయిన తర్వాత ఉంటే తప్పు కదా. నేను అలా లేను. నాకు పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. రేపు ధర్మతో విడాకులు తీసుకున్న తర్వాత బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. తప్పేంటి. మన చట్టాలు ఒకరితో ఉండమని చెప్పాయి. మీ అబ్బాయితో ఉన్నప్పుడే నేను వేరే వాళ్లతో తిరగలేదు కదా. రేపు విడాకులు తీసుకున్న తర్వాత ఎవరికైనా కమిట్ ఇస్తానేమో. ఎందుకంటే నన్ను ప్రేమించే వాళ్లు నా చుట్టూ చాలా మంది ఉన్నారు. కానీ నేను ఎవరినీ మోసం చేయలేదు. నిజాయితీగానే ఉంటున్నాను. నాకు విడాకులు వచ్చేవరకు నేను ఎవరికీ కమిట్ అవ్వలేదు.. అవ్వను అంటూ గౌతమి తెలిపింది.
