మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో అతిరధ మహారథులే నటిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, కన్నడ సూపర్ హీరో ఉపేంద్ర, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా .. తాజాగా మరో హీరోయిన్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక నేడు తమన్నా బర్త్ డే సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ టేపుతూ టీం లోకి ఆహ్వానించారు మేకర్స్. మరి ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ ఎలాంటి పాత్రలో కనిపించనుందో తెలియాల్సి ఉంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది. మరి ఈ చిత్రంతో వరుణ్ విజయాన్ని అందుకుంటాడా..? లేదా ..? అనేది చూడాలి.