Site icon NTV Telugu

Gangubai Kathiawadi: నెట్ ఫ్లిక్స్ లో కొత్త పెళ్లి కూతురు హంగామా.. ఎప్పటినుంచి అంటే.?

gangubai

gangubai

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన చిత్రం గంగూబాయి కతీయావాడి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. కరోనా తర్వాత బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన సినిమాగా ఈ సినిమా రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీ లో స్ట్రీమ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వేశ్యగా అలియా నటన అద్భుతమని చెప్పాలి. గంగూబాయి కతీయావాడి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా నెట్ ఫ్లిక్స్ అధికారంగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ని ప్రకటించింది.

ఏప్రిల్ 26 న ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. చుడండి.. చూడండి .. నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 26 న గంగూబాయి వస్తుంది.. అని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక మరోపక్క ఇటీవలే అలియా.. తాను ప్రేమించిన రణబీర్ ని పెళ్లి చేసుకొని వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆమె పెళ్లి కానుకగా నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. ఇక మరో వారం రోజుల్లో నెట్ ఫ్లిక్స్ లో కొత్త పెళ్లికూతురు హంగామా మొదలు కానుంది.మరి థియేటర్లోనే రచ్చ లేపిన ఈ సినిమా ఓటిటీ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version