Gandeevadhari Arjuna Pre-Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ అవసరం. గతేడాది ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకున్నా.. అది వరుణ్ లెక్కలోకి రాదు. సింగిల్ గా హిట్ అందుకోవడం కోసం వరుణ్ చాలా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ కుర్ర హీరో గాండీవధారి అర్జునతో ప్రేక్షకులను మెప్పించనున్నాడు. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు అయిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో వరుణ్ సరసన ఏజెంట్ భామ సాక్షి వైద్య నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రీ టీజర్ అయినా కూడా ఆద్యంతం ఆసక్తి రేపుతోంది.
Faria Abdullah : స్టన్నింగ్ పోజులతో రెచ్చగొడుతున్న ఫరియా..
ఓ స్టైలిష్ కారులో వరుణ్ తేజ్ ఓ రేంజ్ లో స్పీడ్ లో వెళ్తున్నట్లు చూపించారు. కారులో బ్యాడ్ బాయ్స్ డ్రైవ్స్ బ్యాడ్ టాయ్స్ అని రాసి ఉంది. దీంతో వరుణ్.. విలన్స్ ను ఏ రేంజ్ లో ఆడుకుంటాడో చెప్పొచ్చు. ఇక కారు నుంచి స్టైలిష్ సూట్ లో దిగిన వరుణ్ .. డిక్కీ ఓపెన్ చేసి అందులో ఉన్న గన్స్, బాంబ్స్ ను చేతపట్టుకొని విలన్స్ పై ఓ రేంజ్ లో గురిపెడుతూ కనిపించాడు. వరుణ్ ఫేస్ ను క్లారిటీగా చూపించకపోయినప్పటికీ బ్లాక్ అండ్ వైట్ సూట్ లో వరుణ్.. హాలీవుడ్ హీరోలా కనిపించాడు. ఇక ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో మెగా ప్రిన్స్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
Here is the pre-teaser of #GandeevadhariArjuna
I bet the teaser will have you in overdrive.
Coming soon!💯@PraveenSattaru @sakshivaidya99 @MickeyJMeyer @SVCCofficial @JungleeMusicSTH#GDAonAugust25th pic.twitter.com/HqrXhHbgzT— Varun Tej Konidela (@IAmVarunTej) July 12, 2023