NTV Telugu Site icon

Ganapath trailer: కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లిన టైగర్ ష్రాఫ్ గణపధ్ ట్రైలర్

Ganapath Trailer

Ganapath Trailer

Ganapath trailer: భారతీయ చిత్ర పరిశ్రమలో మరో సంచలనానికి పూజ ఎంటర్టైన్మెంట్ నాంది పలికింది. కొత్త తరహా ప్రపంచంలో వినూత్నమైన యాక్షన్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన గణపధ్ ట్రైలర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న గణపధ్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయగా వినూత్నమైన యాక్షన్ తో కూడిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. ఇక ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి, అక్టోబర్ 20న ఈ సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురు చూసేలా చేసింది. టైగర్ ష్రాఫ్ తో పాటూ కృతి సనన్- అమితాబ్ బచ్చన్ ల కలయికలో వచ్చిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమై అంచనాలు ఉన్నాయి. ఈ ఆసక్తిని మరింత పెంచేందుకు సినిమా యూనిట్ తాజా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఇక ఈ గణపధ్ ట్రైలర్ చూస్తే సినిమాతో ప్రేక్షకులకు ఒక యాక్షన్ ఫీస్ట్ అందివ్వనుందని క్లారిటీ వచ్చేసింది.

Justin Trudeau: తీరుమార్చుకోని ట్రూడో.. యూఏఈ తర్వాత జోర్డాన్‌తో భారత్-కెనడా వివాదంపై చర్చ..

స్టన్నింగ్ విజువల్స్, ఉత్కంఠ రేపే పోరాట సన్నివేశాలతో పాటు, భారీ కాస్టింగ్ ఉండటంతో సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఒక పెయింటింగ్ లాంటి నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లిందని చెప్పచ్చు. భవిష్యత్తును వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్ ద్వారా సృష్టించి ప్రేక్షకులకు ఒక అద్భుతమైన లోకంలో తీసుకెళ్లడానికి ఖర్చుకి నిర్మాతలు ఏమాత్రం వెనుకాడలేదు. నిర్మాత జాకీ భగ్నని సినిమాలో క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తుంటే క్లారిటీ వస్తోంది. ఇక గణపధ్ ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు టైగర్ ష్రాఫ్ మ్యాచో ఫైట్స్, కృతి సనన్ చేసిన స్టన్నింగ్ యాక్షన్, లెజెండ్ అమితాబ్ బచ్చన్ కనిపిస్తూ ఉండటంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. గణపధ్ : ఏ హీరో ఇస్ బార్న్ సినిమాను పూజ ఎంటర్టైన్మెంట్, గుడ్ కో తో కలిసి వికాస్ బహ్ల్ దర్శకత్వంలో దేనికి రాజీ పడకుండా నిర్మించారు. ఈ సినిమాను వశు భగ్నాని, జాకీ భాగ్నని, దీప్శిక దేష్ముఖ్, వికాస్ బహ్ల్ కలిసి నిర్మించారు. దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 20న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గణపధ్ భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అవుతోంది.