Game Changer: గేమ్ చేంజర్ లో రచ్చరేపే యాక్షన్ సీక్వెన్స్ పూర్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer Movie update: ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ తేజ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియాలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మీద ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతున్న ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద అంచనాలను అంతకంతకు పెంచేస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీన రామోజీ ఫిలిం సిటీలో ఒక యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ మొదలైంది. ఎట్టకేలకు ఆ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ నిన్నటితో ముగిసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, నవీన్ చంద్ర ఇద్దరి మధ్య ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. దానిని చాలా పర్ఫెక్ట్ గా అనుకున్న టైంలోనే పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
Vishwambhara: చిందేస్తున్న చిరంజీవి..
Also Read
అన్బరీవ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన ఈ ఫైట్ చాలా బాగా వచ్చిందని యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ షెడ్యూల్ మార్చి రెండో తేదీ వరకు జరగాల్సి ఉంది కానీ ముందుగానే షూటింగ్ పూర్తి చేసేసింది సినిమా యూనిట్. ఇక సినిమాకు సంబంధించిన తదుపరి షెడ్యూల్ మార్చి రెండో వారంలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన అంజలితో పాటు కియారా అద్వానీ నటిస్తోంది. ఎస్జే సూర్య, జయరాం, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నాజర్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తెలుగు వెర్షన్ డైలాగ్స్ సాయి మాధవ్ బుర్ర అందిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు కానీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!