NTV Telugu Site icon

Gaami: అర్ధంకాని రోగంతో బాధపడుతున్నా.. విశ్వక్ డైలాగ్ వైరల్

Gaami

Gaami

Gaami: యంగ్ హీరో విశ్వక్ సేన్, చాందిని చౌదరి జంటగా విద్యాధర్ కగిట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గామి. వి సెల్యులయిడ్స్, కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఏ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విశ్వక్.. ఒక అఘోరగా కనిపించనున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా డబ్బింగ్ వర్క్ ను మొదలుపెట్టింది. ఈ విషయాన్నీ విశ్వక్ తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. “అర్థంకానీ రోగంతో నేనే వద్దని బాధపడుతుంటే.. అసలు ఏ కారణం లేని అవి నీకెందుకు కావాలో నాకు అర్థం కావడం లేదు.. నేను చెప్పనా.. డబ్బు కోసమే కదా..” అనే డైలాగ్ చెప్తూ విశ్వక్ డబ్బింగ్ స్టూడియోలో కష్టపడుతున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

Sreemukhi: శ్రీముఖి లవ్ బ్రేకప్.. ఒకసారి కాదంట..

ఇక అర్ధం కానీ వ్యాధితో బాధపడుతున్నాని తెలిసి హీరో అఘోరగా మారాడా.. ? లేక వేరే కారణం ఉందా.. ? అసలు విశ్వక్ అఘోరా కథ ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను మెప్పించడానికి విశ్వక్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన ఆ సినిమా సమ్మర్ లో రానుంది. మరి ఈ సినిమాలతో విశ్వక్ వచ్చే ఏడాది ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.