OTT Updates: సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. రెండో వారం కూడా ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్న ఈ సినిమా నిర్మాతకు లాభాల పంట పండిస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం అందుతోంది. సుధీర్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్ గాలోడు మూవీ హక్కులను సొంతం చేసుకుంది. మొత్తం శాటిలైట్, ఓటీటీ హక్కులు కలుపుకుని రూ.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల ఈ సినిమాను నిర్మించాడు.
Read Also: Kriti Sanon: ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా.. ఎట్టకేలకు నోరు విప్పిన కృతి
కాగా గాలోడు సినిమా ద్వారా చాలాకాలం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సుధీర్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా సుధీర్ సినీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన గాలోడు మూవీ తొలి మూడు రోజుల్లో అందరినీ ఆశ్చర్యపరిచేలా వసూళ్లను సొంతం చేసుకుంది. తొలిరోజు రూ.1.21 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ రెండో రోజు కూడా అదే స్థాయిలో వసూళ్లను రాబట్టింది. రెండో రోజు గాలోడు మూవీ రూ.1.14 కోట్ల గ్రాస్ సాధించింది. మూడో రోజు ఆదివారం కావడంతో ఈ మూవీ వసూళ్లు పెరిగాయి. మూడో రోజు రూ.1.61 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో నాలుగు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌కు చేరుకుందని ప్రచారం జరుగుతోంది.
Read Also:Radhika Sharathkumar: దేవుడా.. సూపర్ స్టార్ ను పట్టుకొని అంత మాట అనేసిందేంటి..?
