Site icon NTV Telugu

Kota Bommali: తెలుగులో ‘కోటబొమ్మాళి పీఎస్’గా మలయాళ బ్లాక్ బస్టర్

Kotabommali Ps Title Reveal

Kotabommali Ps Title Reveal

GA2 Pictures Production No 8 titled as KotaBommali PS ఇప్పటికే తెలుగులో అనేక సినిమాలు నిర్మించి సూపర్ హిట్లు కొట్టింది గీతా ఆర్ట్స్ 2 బ్యానర్. GA2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు నిర్మించగా కొన్ని ఇతర భాషలు సినిమాలను తెలుగులో రిలీజ్ చేసి బ్లాక్‌బస్టర్‌లను అందించారు. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ కొత్త కావు,ఆ అనౌన్స్ చేసింది. ప్రొడక్షన్ నెం. 8గా తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ సినిమా అయిన నాయాట్టుకి రీమేక్. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరించనున్నారు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో ప్రధాన నటీనటులతో పాటు రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ సహా ఇతర టాలెంటెడ్ టాలీవుడ్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిజానికి ఈ ప్రొడక్షన్ నంబర్ 8 చాలా కాలం క్రితమే లాంచ్ అయిందని చెబుతుండగా ఇప్పుడు ప్రధాన పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్‌లు ప్రేక్షకుల క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి.

Asaduddin Owaisi : ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించిన ఒవైసీ

ఇప్పుడు ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన పవర్‌ఫుల్ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం కోట బొమ్మాళి పి.ఎస్ అనే శక్తివంతమైన, ఆసక్తిని రేకెత్తించే టైటిల్‌ని లాక్ చేసి, శ్రీకాంత్, రాహుల్ విజయ్ అలాగే శివానీ రాజశేఖర్‌లను ఒక మాస్ అప్రోచ్ తో ఉన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక మోషన్ పోస్టర్ చూస్తే “పరారిలో కోట బొమ్మాళి పోలీసులు” అనే టెక్స్ట్‌తో ఫ్లయర్‌తో ప్రారంభమవుతుంది. రాజకీయాలు, పోలీసు బలగాలకు సంబంధించిన తుపాకులు, బ్యాలెట్ పేపర్లు, కరపత్రాలు సహా మరెన్నో అంశాలను ప్రదర్శిస్తుంది. ఇక ఈ టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. గతంలో జోహార్, అర్జున ఫాల్గుణ చిత్రాలను రూపొందించిన తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గరుడ గమన వృషభ వాహన, రోర్‌షాచ్ ఫేమ్ రంజిన్ రాజ్ -మిధున్ ముకుందన్ సంగీతం సమకూర్చారు.

Exit mobile version