NTV Telugu Site icon

Goodachari 2: శోభితాకు చెల్లెలిగా ఉందనే తీసుకున్నావా.. శేష్ బ్రో.. ?

Sesh

Sesh

Goodachari 2: యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సొంతం అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ తో కెరీర్ ను స్టార్ట్ చేసి కర్మ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా .. పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా క్యారెక్టర్ వచ్చేలా చేసింది. అదే శేష్ ను ఇప్పుడు ఇక్కడ నిలబెట్టింది. పంజాలో విలన్ గా శేష్ నటన వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది కానీ, హిట్ అయితే మాత్రం శేష్ విజయం మరోలా ఉండేది. అయితే ఏం బహుబలి లాంటి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. క్షణం లాంటి సినిమాతో మనోడు లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇక గూఢచారి సినిమాతో స్టార్ హీరో రేసులోకి దిగాడు. స్పై క్యారెక్టర్స్ కు ఈ సినిమా ఒక పుస్తకంలా మారింది. ఇక దీని తరువాత గూఢచారికి సీక్వెల్ పైన ఫోకస్ పెట్టాడు శేష్. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ వస్తున్నారు. షూటింగ్ స్టార్ అని అప్పుడెప్పుడో చెప్పారు. ఇప్పటివరకు ఒక అప్డేట్ లేదు అని నిరాశ పడుతున్న అభిమానులకు శేష్ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. గూఢచారి 2 లో హీరోయిన్ ను పరిచయం చేశాడు. ఆమె ఎవరో కాదు..బనితా సంధు. అమ్మడి పేరు వినే ఉంటారు.

Nithiin: త్రిషకు సపోర్ట్ గా నితిన్.. నీచమైన వారికి సమాజంలో స్థానం లేదు

తమిళ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ లో ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్ గా నటించింది. పంజాబ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న బనితా బాలీవుడ్ లో అక్టోబర్, ఉదం లాంటి సినిమాలో నటించి మెప్పించింది. ఇక అన్ని భాషల్లో నటిస్తూ.. గూఢచారి 2 తో తెలుగుకు ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. “ఈ ఉదయం ఒక ప్రత్యేక సర్ప్రైజ్ ను అభిమానుల కోసం తెచ్చాను. G2 బృందం అద్భుతమైన బనితాసంధుని బోర్డులోకి స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
ఆమె హిందీ, ఇంగ్లీష్ మరియు ఇప్పుడు తెలుగులో చేస్తోంది..గ్లోబల్ ఫిల్మ్ కోసం గ్లోబల్ నటి” అంటూ అడివి శేష్ చెప్పుకొచ్చాడు. ఇక ఆమెను చూస్తే ..గూఢచారి లో నటించిన శోభితా ధూళిపాళ్ల గుర్తుకు రాకమానదు. ఇద్దరు అక్కాచెల్లెళ్లలా కనిపిస్తారు. దీంతో ఫ్యాన్స్.. శోభితాకు చెల్లెలిగా ఉందనే తీసుకున్నావా.. శేష్ బ్రో.. ?అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో బనితా టాలీవుడ్ ను ఎలా ఏలుతుందో చూడాలి.