NTV Telugu Site icon

Vijay Devarakond: గొప్ప మనుసు చాటుకున్న విజయ్ దేవరకొండ

Vijay

Vijay

Vijay Devarakond: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా షూటింగ్ లతో గడుపుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్నానూరి సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. చూడ్డానికి చాలా ఆరోగెంట్ గా కనిపించే విజయ్ దేవర కొండకు చాలా మంచి మనసు ఉంది. తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదవాళ్లకు సాయం చేశాడు. ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతో మందికి ఆపన్న హస్తం అందించాడు విజయ్. ఇక ఖుషి సినిమా రిలీజ్ సమయంలో 100 పేద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున మొత్తం కోటీ రూపాయలు పంచాడు. ఇలా ఇబ్బందుల్లో ఉన్న తన ఫ్యాన్స్ కు, ప్రజలకు తన వంతు సాయం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో రీసెంట్ గ విజయ్ దేవర కొండ గొప్ప మనసు గురించి చెబుతూ ఓ ట్రాన్స్ జెండర్ ఎమోషనల్ అయ్యారు.

Also Read: Anant ambani wedding: అక్షయ్‌కుమార్‌కు కోవిడ్ పాజిటివ్.. పెళ్లికి హాజరుకాలేకపోతున్న హీరో

సాయం విషయంలో విజయ్ ను దేవుడితో పోల్చుతూ తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలోనే.. విజయ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలానే ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపూర్‌కు చెందిన మరో కుటుంబం కూడా తెలుగు ఇండియన్ ఐడల్ 3 సెట్‌లను సందర్శించి, పెద్ద శస్త్రచికిత్సల ద్వారా వారి కొడుకు కోలుకోవడానికి సహాయం చేసినందుకు నటుడికి వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ ట్రాన్స్ జెండర్ ఎమోషనల్ మాటలకు విజయ్ కూడా రియాక్టయ్యారు. ‘ఇది నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. ఎక్కడి నుంచో రూ. 500, రూ. 1000 సాయం చేశారు. వారందరి వల్లే ఇది సాధ్యమైంది. ఇంత మంచి మనుషులు మన మధ్య మనం ఉండటం మన ఆశీర్వాదం’ అంటూ విజయ్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. విజయ్ దేవరకొండ చేసిన మంచి పనిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Show comments