NTV Telugu Site icon

Flora Saini: శ్రద్దా వాకర్ లా నేను కూడా చావాల్సిందాన్ని.. బట్టలు కూడా లేకుండా పరిగెత్తా

Asha

Asha

Flora Saini: ఫ్లోరా షైనీ అంటే చాలామందికి తెలియకపోవచ్చు.. అదే లక్స్ పాప అని చెప్పండి ఓ.. ఆశా షైనీనా అని టక్కున గుర్తుపట్టేస్తారు. నరసింహనాయుడు సినిమాలో బాలయ్య తో పాటు లక్స్ పాప లక్స్ పాప లంచ్ కొస్తావా అంటూ స్టెప్పులు వేసి ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసింది ఆశా. ఇక ఆ తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె ఫ్లోరా షైనీగా పేరు మార్చుకొని వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. తన ప్రియుడు, నిర్మాత అయిన గౌరవ్ దోషి తనను ఎలా హింసించాడో చెప్పుకొచ్చింది. అతడికోసం కన్నవాళ్లను కూడా వదిలేయడానికి సిద్ధపడిన ఆమె.. అతని నిజస్వరూపం తెలిసి భయపడినట్లు చెప్పుకొచ్చింది.

” గౌరవ్ .. మొదట్లో నన్ను చాలా బాగా చూసుకున్నాడు.. మా అమ్మ నాన్నలు కూడా అతడిని చూసి సంతోషించారు. వారు కాదన్నా అతడితో పాటు వెళ్ళిపోయా.. కొన్నిరోజులు అంతా బాగానే ఉంది. ఆ తరువాత అతడి నిజ స్వరూపం బయటపడింది. శారీరకంగా..మానసికంగా హింసించేవాడు. శ్రద్దా వాకర్ లా నేను కూడా చావాల్సిందానన్ని. నేను ఇల్లు వదిలి వచ్చిన వారం రోజుల్లోనే అతని చేతుల్లో చావు దెబ్బలు తిన్నాను. ఓ రోజు దవడ విరిగేలా కొట్టాడు. ఒకరోజు నిన్ను చంపేస్తా అని అరుచుకుంటూ వచ్చాడు.. ఆ సమయంలో మా అమ్మ మాటలు గుర్తొచ్చాయి. ఇలాంటి పరిస్థితిలో పారిపోవడం మాత్రమే శరణ్యం. ఒంటికి బట్టలు ఉన్నాయో లేదో కూడా గుర్తులేకుండా పరిగెత్తాను. అలా వచ్చేశాక మళ్లీ అతనివైపు కన్నెత్తి చూడలేద”ని చెప్పుకొచ్చింది.