Yellamma : నితిన్ ‘ఎల్లమ్మ’ పూజా కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయి చాలా కాలం అవుతున్నా కూడా మరో సినిమాను పట్టాలెక్కించలేదు ఈ దర్శకుడు. బలగం సినిమాను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే తన రెండవ సినిమా చేయాల్సి ఉంది.
Also Read :TFC : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం
Also Read
అయితే ఈ కథ అందరి చుట్టూ తిరిగి ఫైనల్ గా యంగ్ హీరో నితిన్ దగ్గరకు వచ్చి చేరింది. పలు మార్పులతో మొత్తానికి ఈ సినిమా అక్కడ ఓకే అయింది. ఈ కథకు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే యల్లమ్మ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసి ఉంచారు. ప్రస్తుతం నితిన్ చేస్తున్నరాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు చివరి దశ షూట్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు నితిన్. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ లో ముహూర్తం పూజ ఉండనుందట. ఏప్రిల్ లేదా మే నుండి షూటింగ్ మొదలు కానుంది. నితిన్ ను సరికొత్తగా చూపించేందుకు కొత్త మెకోవర్ ట్రై చేస్తున్నాడు దర్శకుడు వేణు యెల్డండి. దాదాపు రెండేళ్లుగా ఈ కథ మీద కసరత్తులు చేస్తున్న వేణు ఈ సినిమాతో నితిన్ కు ఎంత పెద్ద హిట్ ఇస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Tamannaah : తమన్నాకి ఐటెం సాంగ్స్ కూడా ఇవ్వట్లేదా?
-
Iran Hit List: ఇరాన్ హిట్‌లిస్ట్‌లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
-
God of War: పాపం త్రివిక్రమ్.. మళ్ళీ కథ మార్చాల్సిందేనా?
-
Naga Vamsi: పైరసీకి పక్కా ప్లాన్‌తో నాగ వంశీ చెక్.. ‘లెనిన్’ విషయంలో ఏం జరిగింది?
-
Tollywood : సింగిల్ థియేటర్స్ మూత పడడానికి స్టార్ హీరోలే కారణమా?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!