Site icon NTV Telugu

Project K : ‘బాహుబలి’తో అమితాబ్ ఫస్ట్ డే, ఫస్ట్ షాట్… ఇద్దరూ ఇద్దరే !

Amitabh-Bachchan-Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “ప్రాజెక్ట్ కే”. ఇక ఇప్పటికే షూటింగ్ లో పాల్గొన్న దీపిక ఇటీవలే హైదరాబాద్‌లోని సెట్స్ నుండి రెండు చిత్రాలతో పాటు ఒక వీడియోను పంచుకుంది. ఇప్పుడు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్‌, ప్రభాస్ ల ఫస్ట్ షాట్ ను మేకర్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమితాబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. “మొదటి రోజు.. మొదటి షాట్.. ‘బాహుబలి’ ప్రభాస్‌తో మొదటి సినిమా.. ఆయన ప్రతిభ, వినయం, నేర్చుకోవడం వంటివి అద్భుతం… ప్రభాస్ తో కలిసి చేయడం గౌరవంగా భావిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

Read Also : Taapsee Pannu: తాప్సీ షాకింగ్ నిర్ణయం.. తట్టుకోలేమంటున్న ఫ్యాన్స్

మరోవైపు ప్రభాస్ కూడా అమితాబ్ 1975లో చేసిన “దీవార్‌” చిత్రంలోని పిక్ ను పంచుకుంటూ “నా కల నిజమైంది… లెజెండరీ అమితాబ్‌ బచ్చన్ సర్‌తో ఈరోజు #ProjectK మొదటి షాట్‌ను పూర్తి చేసాను!” అంటూ అభిమానులతో తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను పంచుకున్నారు. వీళ్లిద్దరి ట్వీట్లు చూసిన నెటిజన్లు అవతలి వారిని గౌరవించడంలో ఇద్దరూ ఇద్దరేనని కామెంట్స్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “ప్రాజెక్ట్ కే”కు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. తాజాగా సినిమా రెండవ షెడ్యూల్ స్టార్ట్ కాగా, సెట్స్‌లో ప్రభాస్ తో పాటు అమితాబ్ కూడా జాయిన్ అయ్యారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

Exit mobile version