NTV Telugu Site icon

Gentleman-2: జెంటిల్ మ్యాన్ 2.. అంతకు మించి ఉండబోతుందట

Gm

Gm

Gentleman-2: అర్జున్ సర్జా, మధుబాల జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెంటిల్ మ్యాన్. 1993 లో వచ్చిన ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమోన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక దాదాపు 30 ఏళ్ల తరువాత మెగా ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమోన్‌.. జెంటిల్ మ్యాన్ సీక్వెల్ ను ప్రకటించాడు. చేతన్ హీరోగా నయనతార చక్రవర్తి, ప్రియాలాల్ హీరోయిన్స్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి జెంటిల్ మ్యాన్ 2 అనే పేరును ఖరారు చేశారు. ఎ. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఈ సినిమా మొదటి దశ షూటింగ్‌ను 15 రోజుల్లో ముగించారు. ఈ షెడ్యూల్‌లో చేతన్, నయనతార చక్రవర్తి, ప్రియా లాల్, బాడవ గోపి, సుధా రాణి, సితార, శ్రీ లత, కన్మణి, లొల్లు సభ స్వామినాథన్, బేబీ పద్మ రాగం మరియు ముల్లై-కోతాండమ్‌లు పూర్తిగా పాల్గొన్నారు.

Katrina Kaif: ప్రపంచంలోనే బెస్ట్ యాక్షన్ టీమ్‌ తో కలిసి పని చేశాను

ఇక అంతేకాకుండా, స్టంట్ మాస్టర్ దినేష్ కాసి కొరియోగ్రఫీ చేసిన ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాన్ని కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు. ప్రతి అంశంలో గ్రాండ్‌నెస్‌ని కప్పి ఉంచే తదుపరి షెడ్యూల్ నవంబర్ మూడవ వారంలో ప్రారంభమవుతుంది, ఇది చెన్నై, హైదరాబాద్ మరియు పాండిచ్చేరిలో చిత్రీకరించబడుతుంది. ఇతర షెడ్యూల్‌లను మలేషియా, దుబాయ్ మరియు శ్రీలంకలో చిత్రీకరించనున్నారు. వైరముత్తు సాహిత్యం అందించిన ఏడు పాటలున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జెంటిల్ మ్యాన్ ను మించి ఉండబోతుందని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments