NTV Telugu Site icon

Satyam Rajesh: పొలిమేర ఎఫెక్ట్.. హీరోగా మరో సినిమా ఓకే చేసిన కమెడియన్

Rajesh

Rajesh

Satyam Rajesh: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. ఎలాంటివారిని అయినా స్టార్స్ గా నిలబెడుతుంది. ఆ ఒక్క సినిమా కోసం ఎంతోమంది నటులు.. ఎంతోకాలంగా ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా ఒక స్టార్ డమ్ ను అందుకున్నాడు కమెడియన్ సత్యం రాజేష్. సత్యం సినిమాతో మంచి గుర్తింపు రావడంతో సత్యం రాజేష్ గా పేరు మార్చుకున్నాడు. ఇక తనదైన కామెడీతో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సత్యం రాజేష్ జీవితాన్ని పొలిమేర సినిమా మార్చేసింది. కరోనా సమయంలో ఓటిటీలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కొమరయ్య పాత్రలో సత్యం రాజేష్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. ఇక దాదాపు మూడేళ్ళ తరువాత ఆ సినిమాకు సీక్వెల్ గా పొలిమేర 2 ను మేకర్స్ ప్రకటించారు. అప్పటినుంచి ఈ సినిమాపై ఆసక్తి మొదలైంది. ఎన్నో అంచనాలతో ఈ మధ్యనే పొలిమేర 2 రిలీజ్ అయ్యి.. భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబడుతుంది.

Anasuya: ఆ కుర్ర హీరో లైన్ వేస్తున్నాడనుకొని.. రంగమత్త అవైడ్ చేసిందట

ఇక ఇదే జోరులో సత్యం రాజేష్.. వరుస సినిమాలతో బిజీగా మారాడు. తాజాగా సత్యం రాజేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా టెనెట్. y. యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మొగళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సత్యం రాజేష్ సరసన మేఘా చౌదరి నటిస్తుండగా.. ఆడుకులం నరేన్, ఎస్తేర్ నోరోన్హా, చందన పయ్యావుల తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ ఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమాతో సత్యం రాజేష్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Show comments