Site icon NTV Telugu

Kiran Abbavaram: ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’!

NMBKV

శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు, స్వర్గీయ కోడి రామ‌కృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో ఓ సినిమాను ప్రారంభించింది. కార్తిక్ శంక‌ర్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ తీస్తున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు తాజా ఈ సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది.

Read Also : Bheemla Nayak Pre-release Event : ‘పుష్ప’ మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఆ బాధ్యత పోలీసులకే !

‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ అనే టైటిల్ ని పెట్టింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసింది. ‘తన కోడి రామకృష్ణ ఎప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు తీసేవారని, అందుకే అందరూ ఇష్టపడేలా, అందరికీ నచ్చేలా ఈ టైటిల్ ను పెట్టామ’ని దివ్య దీప్తి తెలిపారు. సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్‌ మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌, స‌మీర్‌, సంగీత‌, నిహ‌రిక‌, ప్ర‌మోదిని ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=v97rAjyN_hQ
Exit mobile version