యాక్షన్ మూవీ ప్రియులకు, బాక్సింగ్ అభిమానులకు ఐఫీస్ట్ గా ఉండబోతున్న’లైగర్’ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా కన్పిస్తున్న విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ పాన్ ఇండియా మూవీలో మైక్ టైసన్ నటిస్తుండటంతో ‘లైగర్’కు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈరోజు దీపావళి సందర్భంగా ‘లైగర్’ చిత్రం నుంచి మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ఇంటెర్నేషనల్ బాక్సర్ మైక్ టైసన్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. మైక్ టైసన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది.
“లైగర్” దీపావళి స్పెషల్ గా మైక్ టైసన్ లుక్ రిలీజ్

Liger