‘లక్ష్యాస్ ఫ్రైడే’ అంటున్నాడు నాగ శౌర్య! ప్రతీ శుక్రవారం తమ చిత్రం గురించిన ఏదోఒక అప్ డేట్ ఉంటుందని చెప్పిన చిత్ర యూనిట్ ఈసారి హీరోయిన్ ఫస్ట్ గ్లింప్స్ అందించారు. నాగ శౌర్య సరసన కేతికా శర్మ కథనాయికగా నటిస్తోంది ‘లక్ష్య’మూవీలో. ఆమె ఫస్ట్ గ్లింప్స్ ఆన్ లైన్ లో విడుదల చేయగానే వైరల్ గా మారింది. కేతికకి ‘లక్ష్య’ సినిమాయే డెబ్యూ ప్రాజెక్ట్!
నాగశౌర్య, కేతిక జంటగా దర్శకుడు సంతోష్ రూపొందిస్తోన్న చిత్రం ‘లక్ష్య’. ప్రాచీన విలువిద్య అంశంతో ముడిపడ్డ ఈ సినిమా కథ ఆసక్తికరంగా, వినూత్నంగా ఉంటుందట. రితికా పాత్రలో కేతికా కనిపించనుంది. ప్రస్తుతం ‘లక్ష్య’ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏక కాలంలో కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మన ముందుకి రానుంది…
