నటసింహం నందమూరి బాలకృష్ణ “అఖండ” థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమాతో “అఖండ” జాతర జరుపుకుంటున్నారు. సినిమా విడుదలై మూడు నాలుగు రోజులు అవుతున్నా ప్రేక్షకుల నుంచి ఏమాత్రం ఆదరణ తగ్గలేదనే చెప్పాలి. ఇలా ఒకవైపు హీరో బాలకృష్ణ “అఖండ” చిత్రంలో తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో వెండితెరపై ఫైర్ సృష్టిస్తుంటే… మరోవైపు “అఖండ” ప్రదర్శితం అవుతున్న మరో థియేటర్లో నిజంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
Read Also : పింకీ కోరికపై పాటలు పాడిన ఆ ఇద్దరూ!
శ్రీకాకుళంలో “అఖండ”ను ప్రదర్శిస్తున్న రవిశంకర్ థియేటర్‌లోని సౌండ్ సిస్టమ్ మంటల్లో చిక్కుకుంది. సినిమాలో మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే మ్యూజిక్ భారీగా ఉన్నప్పటికీ సౌండ్ సిస్టమ్ లో హైవాల్యూమ్ పెంచడం వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనితో అభిమానులు థియేటర్ నిర్వాహకులు కొన్ని నిమిషాల పాటు ఆందోళనకు గురయ్యారు. స్క్రీనింగ్ మధ్యలో స్క్రీన్ వెనుక సౌండ్ సిస్టమ్‌లో మంటలను ప్రేక్షకులు గమనించడంతో భయంతో ఆడిటోరియం నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే థియేటర్ నిర్వాహకులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
