NTV Telugu Site icon

Sivaji: ప్రశాంత్ గురించి పదేపదే ప్రతీసారి మాట్లాడాలా ఏంటి? అరెస్ట్‌పై శివాజీ స్పందన

Finally Sivaji Responds on Pallavi Prsahanth Arrest: బిగ్ బాస్ సీజన్ 7 కప్ గెలిచిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడని సంతోషించేలోపే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈ విషయం మీద శివాజీ స్పందించకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నా క్రమంలో ఒక వీడియోను విడుదల చేశాడు శివాజీ. చాలా మంది నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతున్నారు వాడు చట్టప్రకారం బయటికి వస్తాడు. చట్టం మీద గౌరవంతో ఉన్న తను ఎక్కడికీ పారిపోలేదు అయితే పారిపోయాడని థంబ్‌నెయిల్స్ పెట్టారు అది చూసి చాలా బాధేసింది. ప్రశాంత్ ఎలాంటివాడో నాలుగు నెలలు ఒక హౌజ్‌లో ఉండి చూశా, మంచి కుర్రాడు, వయసు ప్రభావంతో గెలిచాను అన్న ఆనందం మనిషిని డామినేట్ చేయవచ్చని అన్నారు. ఇక ప్రశాంత్ గురించి పదేపదే ప్రతీసారి మాట్లాడాల్సిన అవసరం లేదన్న ఆయన సంఘటన జరిగిన మొదటి గంట నుంచి ఇప్పటివరకు అసలు ఏం జరుగుతుందో ప్రతీ విషయం నాకు తెలుసు, అయితే నేను ప్రతీది నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

Salaar: కెజీఎఫ్-సలార్ విషయంలో ఈ కోయిన్సిడెన్స్ అదిరిపోయింది…

ఎందుకంటే వాడికి నేనేంటో తెలుసు, నాకు వాడేంటో తెలుసు, ప్రశాంత్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి అని చట్టప్రకారమే తను బయటికి వస్తాడని అన్నారు. కచ్చితంగా ప్రశాంత్ బయటికి వస్తాడని ఆశిస్తున్నా, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే సోమవారం, ఎందుకంటే చట్టానికి లోబడిన అంశం కాబట్టి, చట్టాన్ని మనందరం గౌరవించాలి అని అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు, వారి కుటుంబ సభ్యులు నాతో టచ్‌లోనే ఉన్నారని పేర్కొన్నాడు. హౌస్ లో నుంచి వచ్చి మూడు రోజులే అయ్యింది కాబట్టి ఇంకా అది మా మైండ్‌లో నుంచి పోలేదు, అది మీకు అర్థం కాదు, నేను తట్టుకున్నా కానీ ఆ వయసుకు ఆ పిల్లలు తట్టుకోలేరు కాబట్టి ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. ఇక బయటకు వచ్చాక యావర్‌ను కలిశానని, కలిసి విషయం బయటికి చెప్పుకోవాల్సిన అసవరం లేదని చెప్పుకొచ్చాడు శివాజీ.