NTV Telugu Site icon

Adipurush: ఇది కదా ఆదిపురుష్ నుంచి మనకి కావాల్సిన స్టఫ్…

Adipurush

Adipurush

విజువల్స్ ఎఫెక్ట్స్ బాగోలేవు, బాలీవుడ్ డైరెక్టర్ మన ప్రభాస్ ని సరిగా చూపించలేదు, ఓం రౌత్ అసలు డైరెక్టర్ కాదు, అన్ని కోట్లు ఖర్చు పెట్టి యానిమేషన్ సినిమా చేశారు ఏంటి? ఇలాంటి గ్రాఫిక్స్ తో పాన్ ఇండియా సినిమా ఎలా చేశారు? ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ చెయ్యకుండా ఉండాల్సింది, రాధే శ్యామ్-సాహూల లిస్టులో ఈ సినిమా కూడా చేరిపోతుంది, అసలు ఇది రామాయణమేనా? ప్రభాస్ ఏంటి అలా ఉన్నాడు? రావణుడు ఏంటి స్టైలిష్ గా కనిపిస్తున్నాడు? ప్రమోషన్స్ చెయ్యట్లేదు, ఇక సినిమాకి ఓపెనింగ్స్ ఎలా వస్తాయి? ఇది ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ గురించి టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి వినిపిస్తున్న నెగటివ్ కామెంట్స్. ఇతర హీరోల అభిమానులు కాదు స్వయంగా ప్రభాస్ ఫాన్స్ చేసిన కామెంట్స్ ఇవి. ఆదిపురుష్ సినిమాపైన వేసిన ట్రోల్స్, మీమ్స్ కి అయితే లెక్కే లేదు. ఈ లెక్కలన్నింటినీ తారుమారు చేసింది ఒక్క సాంగ్, ఒక్క మోషన్ పోస్టర్. ఇప్పటివరకూ పాయింట్ అవుట్ చేసిన ప్రతి వేలుని ముడుచుకునేలా చేశాడు ఓం రౌత్, దెబ్బకు సీన్ మారిపోయింది.

రీసెంట్‌గా ట్రిబెకా ఫెస్టివల్‌లో ఆదిపురుష్ ప్రీమియర్‌ షోకి చోటు దక్కించుకోవడంతో… పాజిటివ్ వైబ్స్ ఇచ్చిన ఆదిపురుష్ సినిమా, తాజాగా నిమిషం నిడివి గల ‘జై శ్రీరామ్’ అంటూ సాగే లిరికల్ మోషన్ పోస్టర్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. “నీ సాయం సదా మేమున్నాం సిద్ధం సర్వ సైన్యంసహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం మా బలమేదంటే నీపై నమ్మకమే తలపున నువ్వుంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్ర నీ నామం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్” అంటూ శ్రీరాముడి గొప్ప‌త‌నాన్ని చాటి చెబుతూ ఈ పాట సాగింది. అజయ్, అతుల్ మ్యూజిక్.. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్.. ఆడియెన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అక్షయత్రితియ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. విల్లు పట్టుకొని రాముడిలా ఉన్న ప్రభాస్‌ని చూస్తే.. వాల్మీకీ రాసిన రామాయణంలో రాముడు ఇలానే ఉంటారా అనిపించకమానదు. ఈ మోషన్ పోస్టర్ అండ్ జై శ్రీరామ్ సాంగ్ వలన ఇప్పటి నుంచి ఆదిపురుష్ పాజిటివ్ మేనియా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇదే జోష్ ని జూన్ 16 వరకూ మైంటైన్ చేస్తే చాలు ఆదిపురుష్ సినిమా ఇండియన్ థియేటర్స్ ని రామమందిరాలుగా మార్చడం గ్యారెంటీ.