Tollywood Bandh : 50 ఏళ్ల కిందటి యూనియన్ రూల్స్ తో ఇప్పుడు సినిమాలు తీయలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్మిక సంఘాల సమ్మెతో టాలీవుడ్ స్తంభించింది. ఈ బంద్ పై కొందరు తెలుగు చలన చిత్ర నిర్మాతలు ఇన్ సైడ్ గా మాట్లాడుతూ ’50 ఏళ్ల కిందటి యూనియన్ రూల్స్ తో నేటి పరిస్థితుల్లో నిర్మాతలు సినిమాలు తీయలేరు, వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో ఈ సమ్మెకు ముగింపు పలికేందుకు నిర్మాతలు సాధ్యమైనంతగా స్పందిస్తున్నారు. ఇతర చిత్ర పరిశ్రమల్లో ఉన్నట్లే టాలీవుడ్ లోనూ సినీ కార్మికుల పని గంటలు ఉండాలని నిర్మాతలు కోరుతున్నారు. అనేక కారణాలతో నిర్మాతలకు సినిమాల నుంచి తమ పెట్టుబడికి తగిన ఆదాయం రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులకు వేతనాలు పెంచడం నిర్మాతలపై మరింత భారమవుతుంది.
సినీ కార్మికులకు ఈ ఏడాది 10శాతం, వచ్చే ఏడాది నుంచి రెండేళ్ల పాటు 5 శాతం పెంచుతామని నిర్మాతలు చెబుతున్నారు. ఈ పెంపు ఇతర చిత్ర పరిశ్రమల్లో కార్మికులకు చెల్లిస్తున్న దానికంటే ఎక్కువగానే ఉంది. రోజుకు 2 వేల రూపాయల కంటే ఎక్కువ వేతనాలు తీసుకుంటున్న కార్మికులకు ఇంకా పెంచడం ఏమాత్రం సరైనది కాదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సినిమా మేకింగ్ ను ఇంకా సమర్థవంతంగా చేసే మార్గాలను నిర్మాతలు అన్వేషించాల్సిఉంది. సినీ కార్మికులకు వేతనాలు పెంచడాన్ని చిన్న నిర్మాతలు అంగీకరించడం లేదు. సినిమా కోసం 24 క్రాఫ్టుల కార్మికులు పనిచేసే విధానం మారాల్సిన అవసరం ఉంది. 50 ఏళ్ల కిందట యూనియన్లు రాసుకున్న నిబంధనల ప్రకారం వెళ్తే ఇప్పటి నిర్మాతలు సినిమాలు నిర్మించలేరు. దేశీయంగా హైదరాబాద్ నగరం సినీ రంగానికి హబ్ గా మారుతోంది. కార్మికులు ఇలాంటి నిబంధనలు విధించడం వల్ల ఇతర భాషల నుంచి మేకర్స్ నగరానికి రావడానికి ఆసక్తి చూపించరు. సృజనాత్మక పరిశ్రమ అయిన టాలీవుడ్ లో స్కిల్ డెవలప్ మెంట్ తో పాటు కొత్త టాలెంట్ రావాల్సిన అవసరం ఉంది. యూనియన్ లో చేరేందుకు లక్షలాది రూపాయలు రుసుములు వసూలు చేస్తుండటం కొత్త టాలెంట్ చిత్ర పరిశ్రమలోకి రావడం అవరోధంగా మారుతోంది’ అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!