Site icon NTV Telugu

Tollywood : రేపు ఫెడరేషన్, ఛాంబర్ భేటీ.. ముగింపు పలుకుతారా..?

Tollywood

Tollywood

Tollywood : సినీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతోంది. అటు నిర్మాతలు మొన్న చెప్పిన వేతనాల పెంపు విధానానికి కార్మికులు అస్సలు ఒప్పుకోవట్లేదు. మొత్తం 13 సంఘాలకు వేతనాలు 30 శాతం పెంచాల్సిందే అని పట్టుబడుతున్నారు. దీంతో నేడు రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో నేడు నిర్మాతలు భేటీ అయ్యారు. ఇటు తెలంగాణ సినిమాశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పలువురు నిర్మాతలు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇరు వర్గాలు పట్టువిడుపుతో ఉండాలని సూచించారు. రేపు ఫెరేషన్, ఛాంబర్ ప్రతినిధులు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.

Read Also : Rashmika : నాపై కుట్ర చేస్తున్నారు.. రష్మిక సెన్సేషనల్ కామెంట్స్

ఫెడరేషన్ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో రేపు రెండు వర్గాలు భేటీ కాబోతున్నాయి. ఇప్పటికే పలుమార్లు భేటీ అయినా చర్చలు ఫలించలేదు. దీంతో రేపు ఏదో ఒకటి ఫైనల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాల షూటింగులు ఆగిపోయాయి. దీంతో రేపు ఈ సమస్యకు ముగింపు పలుకుతారని తెలుస్తోంది. సినీ కార్మికులు మొదటి ఏడాది 20 శాతం పెంచాలని తర్వాత 10 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు మాత్రం రూ.2వేలు అంతకంటే తక్కువ ఉన్న వారికే పెంచాతమని చెబుతోంది. ఇక్కడే కొన్ని కండీషన్లు కూడా పెడుతోంది. ఇరు వర్గాల దగ్గరగా వచ్చాయి కాబట్టి రేపు ఫైనల్ చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది.

Read Also : Dhanush-Mrunal Thakur :ధనుష్ తో డేటింగ్.. ఎట్టకేలకు స్పందించిన మృణాల్..

Exit mobile version