థియేటర్ల బంద్ పిలుపు నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో టాలీవుడ్ సినీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసేందుకు నిర్ణయించారు. అందుకోసం టాలీవుడ్ నుండి ఎవరెవరు వెళ్లాలి అనే దానిపై మీటింగ్స్ కూడా నిర్వహించి కొందరి పేర్లతో లిస్ట్ కూడా రెడీ చేసారు. వారిలో పలువురు ప్రముఖ స్టార్ హీరోలు, నిర్మాతలు దర్శకులు ఉన్నారు.
Also Read : HHVM : హరిహర… ఏమిటా రేట్లు.. తేడా వస్తే అంతే
జూన్ 15న ఏపీ సీఎం టాలీవుడ్ పెద్దలకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. ఇక అంతా రెడీ అనుకునే టైమ్ లో ఈ మీటింగ్ ను వాయిదా వేశారు. ఇక అప్పటి నుండి అంత గప్ చుప్. ఎవరికీ వారు తమ తమ షూటింగ్స్ లో బిజి అయ్యారు. ఏవైనా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ లు ఉంటె ఎవరికి వారు తమ తమ పరిచయాల ద్వారా ఏపీ ప్రభుత్వం నుండి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. అలానే మరి కొందరు మాకెందుకులే లేనిపోని తలనొప్పి అని ఊరుకున్నారు. అయితే ఇదే సినిమా పెద్దలు గత ప్రభుత్వంలో మీటింగ్ అనగానే స్టార్ హీరోలు తమ తమ షూటింగ్స్ ను పక్కన పెట్టి అమరావతిలో అడుగుపెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటుతున్న కూడా ఇంతవరకు ఎవరు భేటీ కాలేదు. ఇదే పవన్ కళ్యాణ్ సినిమా పెద్దలపై ఆగ్రహానికి కారణమైంది. గత నెలలో వాయిదా పడిన ఈ మీటింగ్ ఎప్పుడు అనేది ఎవరికి క్లారిటీ లేదు. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే ఎవరికి వారు వెళ్లి పర్మిషన్స్ తెచ్చుకుంటున్నారు. మన పనులు అవుతున్నాయి కదా ఇక సీఎం తో భేటీ కోసం అంత తొందర పడాల్సిన అవసరం ఏముందిలే అని గుసగుసలాడుకుంటున్నారు.
