Veekshanam: థ్రిల్లింగ్ సందర్భాల్లో కూడా నవ్వు తెప్పించడం ఈ సినిమా ప్రత్యేకత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. . ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొందిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు మనోజ్ పల్లేటి, సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు.
Pushpa 2: మైండ్ పోతుంది సార్ లోపల.. హైపెక్కించేసిన డీఎస్పీ
Also Read
- Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం... 'రామాయణం' వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
- Mowgli : రోషన్ కనకాల కోసం బరిలోకి జూనియర్ ఎన్టీఆర్
- Srinidhi Shetty: రాగ పాత్రతో మరో ఫేస్ చూపించబోతోంది శ్రీనిధి.. ‘తెలుసు కదా’పై ఆసక్తికర కామెంట్స్!
- Saif Ali Khan : నాపై దాడి కొందరికి నాటకమైంది.. అసహనం వ్యక్తం చేసిన సైఫ్
ముందుగా దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ నేను రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో డీఎఫ్టీ కోర్స్ చేశా, ఒకరోజు విక్టరీ వెంకటేష్ ఒక మాట చెప్పారు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే మన పని మనం చూసుకోవడం అని. వెంకటేష్ చెప్పిన ఆ మాటే ఈ సినిమా లైన్ కు మూలం. అక్కడి నుంచి వీక్షణం సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుని స్క్రిప్ట్ రెడీ అయ్యాక కొంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గరకు వెళ్లా. ఫైనల్లీ పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి, మేము కలిసి ఈ మూవీ స్టార్ట్ చేశాం. హారర్ కామెడీస్ మీరంతా చూసి ఉంటారు కానీ కామెడీ థ్రిల్లర్ అనేది కొత్తగా ఉంటుంది. థ్రిల్లింగ్ సందర్భాల్లో కూడా నవ్వు తెప్పించడం మా సినిమా ప్రత్యేకత. ఈ కథలో రియల్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి, వాటికి ఫిక్షన్ జోడించి సినిమాను రూపొందించా. సంగీత దర్శకుడి కోసం చూస్తున్నప్పుడు సమర్థ్ ఇంటర్వ్యూ ఒకటి యూట్యూబ్ లో చూసి ఈ కథ చెప్పా, చెప్పగానే ఆయన ఎగ్జైట్ అయ్యి మా టీమ్ లో జాయిన్ అయి మా మూవీ మూడ్ ను తన మ్యూజిక్ తో సమర్థ్ బాగా క్యారీ అయ్యేలా చేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మా మూవీకి బాగా కనెక్ట్ అవుతారు. మా సినిమాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే అవి ఎవరినీ ఇబ్బంది పెట్టేలా ఉండవు. థ్రిల్లర్స్ అనేవి యూనివర్సల్ కాన్సెప్ట్స్. వీక్షణం లాంటి సినిమాలను భాషలకు అతీతంగా ఎవరైనా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మా మూవీని థియేటర్ లోనే బాగా ఎంజాయ్ చేస్తారు. సంతోషంగా లైఫ్ లీడ్ సాగిస్తున్న ఓ అబ్బాయి జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చి ఎలాంటి ఇబ్బందులు తీసుకొచ్చింది అనేది మా మూవీ కాన్సెప్ట్ అన్నారు.
సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ నేను ఎంఎస్ రాజు 7 డేస్, 6 నైట్స్ అనే మూవీకి మ్యూజిక్ చేశాను. వీక్షణం సంగీత దర్శకుడిగా నాకు రెండో సినిమా. ఈ సినిమాలో కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ, లవ్, రొమాన్స్ వంటి అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఇలాంటి కథకు మ్యూజిక్ చేసే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నా. ఈ సినిమాలో 3 సాంగ్స్ ఉంటాయి. ఒకటి సిధ్ శ్రీరామ్ పాడారు. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఈ కథ దర్శకుడు చెప్పగానే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించి మూవీ చేస్తానని చెప్పాను అన్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!