పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘రాజా సాబ్’ ఒకటి. ఇప్పటి వరకు భారీ యాక్షన్ చిత్రాలతో అలరించిన డార్లింగ్.. ఈ మూవీతో మళ్లీ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల అంచనాలు పీక్‌లో ఉన్నాయి. ఇందులో ప్రభాస్ పాత్ర కూడా పూర్తిగా న్యూలుక్‌లో ఉంటుందట. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అసలు హైలైట్ ఎవరంటే.. టాప్ కమెడియన్స్ అని తెలుస్తోంది.
Also Read:Jiggel: మార్చ్ లో ‘జిగేల్’ మనిపిస్తారట!
మనకు తెలిసి మారుతి సినిమాల్లో హీరో క్యారెక్టర్ కన్నా కమెడియన్స్‌కే ఎక్కువ స్కోప్ ఇస్తాడు. ఇక ఇప్పుడు రాజా సాబ్‌లో కూడా ఆ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడట. మరి ఇంతకీ టాప్ కమెడియన్స్ ఎవరు అంటే.. బ్రహ్మానందం, అలీ లాంటి సీనియర్ లెజెండ్స్‌తో పాటు యంగ్ సెన్సేషన్ వెన్నెల కిషోర్ , సప్తగిరి, గెటప్ శ్రీను లాంటి వాళ్ల తో పాటు కోలీవుడ్ నుంచి యోగిబాబు, వీటీవీ గణేష్‌లను కూడా మారుతి లాక్ చేశాడట.కేవలం హారర్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు, ప్రతి సీన్‌లోనూ పంచ్‌లు, సన్నివేశాలు ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించేలా ఉండబోతున్నాయని అంటున్నారు. అంతే కాదు వీరందరూ స్క్రీన్ షేర్ చేసుకున్న సీన్లు హిలేరియస్‌గా వచ్చాయని, వీరి కోసం స్పెషల్ స్క్రిప్ట్ కూడా రాయించినట్లు టాక్. మొత్తానికి మారుతి ప్లాన్ తో వస్తున్నాడు.