Satyam Sundaram: వాళ్లిద్దరూ లేకుంటే ‘సత్యం సుందరం’ లేదు: డైరెక్టర్ సి. ప్రేమ్ కుమార్ ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyam Sundaram Movie Director Prem Kumar Interview: హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ సినిమా విశేషాలు పంచుకున్నారు.
96 తర్వాత మీ ‘సత్యం సుందరం’ కథ పరంగా ఎలాంటి వైవిధ్యం వుంటుంది?
-96 లవ్ స్టొరీ. సత్యం సుందరం ఫ్యామిలీ డ్రామా. కార్తీ, అరవింద్ స్వామి క్యారెక్టర్స్ మధ్య ఒక నైట్ లో జరిగిన కథ. వాళ్ళ మధ్య అనుబంధం ఏమిటి? ఆ ఒక్క నైట్ లో వారి మధ్య ఎలాంటి మానసిక సంఘర్షణ జరిగిందనేది హోల్ స్టొరీ.
Also Read
- Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం... 'రామాయణం' వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
- Mowgli : రోషన్ కనకాల కోసం బరిలోకి జూనియర్ ఎన్టీఆర్
- Srinidhi Shetty: రాగ పాత్రతో మరో ఫేస్ చూపించబోతోంది శ్రీనిధి.. ‘తెలుసు కదా’పై ఆసక్తికర కామెంట్స్!
- Saif Ali Khan : నాపై దాడి కొందరికి నాటకమైంది.. అసహనం వ్యక్తం చేసిన సైఫ్
ఈ కథని ముందుగా నవలగా రాసిన తర్వాత స్క్రీన్ ప్లే చేశారని విన్నాం?
-ఒక ఆర్ట్ ని చేయడంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి అలోచించను. ఇట్ ఈజ్ ఎన్ ఆర్ట్ దటాల్స్. వర్క్ చేస్తున్నప్పుడు మనకి హ్యాపీనెస్ ని ఇచ్చిందా? ఆసక్తిని కలిగించిందా? ఆర్టిస్టులు ఎక్సయిట్ గా వున్నారా లేదా అనేది చూస్తాను. నేను తృప్తిగా వుంటేనే సినిమా తీయగలను. కార్తీ, అరవింద్ స్వామి లాంటి మంచి యాక్టర్స్ ని కన్వెన్స్ చేయగలను. నేను సాటిస్ఫై కాకపోతే మిగతా వారిని సాటిస్ఫై చేయలేను. రైటింగ్, సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. కార్తీ, అరవింద్ స్వామి ముందు నవల చదివారు. దాన్ని స్క్రిప్ట్ గా మలచడం వెరీ ఈజీ. నవల కూడా సినిమా స్క్రిప్ట్ స్ట్రక్చర్ లోనే రాశాను.
ఈ కథకి కార్తీ, అరవింద్ స్వామీ మీ ప్రైమరీ ఛాయిస్ నా ?
-కార్తీ, అరవింద్ స్వామీ ఇద్దరిలో ఎవరు అంగీకరీంచకపోయినా ఈ సినిమా చేసేవాడిని కాదు. ఇలా ఎందుకు చెబుతున్నానో సినిమా చూసినప్పుడు మీకు అర్ధమవుతుంది. వాళ్ళిద్దరే ఆ పెర్ఫార్మెన్స్ చేయగలరు. వాళ్ళ కెమిస్ట్రీ, కాంబినేషన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్.
ప్రొడ్యూసర్ గా సూర్య నుంచి ఎలాంటి సపోర్ట్ వుంది ?
-సూర్యకి సినిమా అంటే చాలా పాషన్. మంచి సినిమాలు చేయాలనే తపనతో ఉంటారు. ఈ కథ ఆయనకు చాలా నచ్చింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు.
సత్యం సుందరం మ్యూజిక్ గురించి ?
-96 సినిమాకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామాన్, ఎడిటర్ ఈ సినిమాకి పని చేశారు. మేమంతా ఫ్రెండ్స్. ఇది నాకు బిగ్ స్ట్రెంత్. గోవింద వసంత 96 కి ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారో అందరికీ తెలుసు. సత్యం సుందరం సినిమాకి కూడా అంతే అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమా మ్యూజికల్ ట్రీట్ లా వుంటుంది. టెక్నికల్ గా సినిమా స్ట్రాంగ్ గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ స్టోరీ చాలా అద్భుతంగా సపోర్ట్ చేసేలా ఉంటాయి.
‘సత్యం సుందరం’ తెలుగు ప్రేక్షకులని ఎంతలా ఆకట్టుకుంటుంది ?
-తెలుగు వెర్షన్ డబ్బింగ్ అద్భుతంగా వచ్చింది. సినిమా చూసిన ఫ్రెండ్స్ చాలా బావుందని చెప్పారు. ‘సత్యం సుందరం’ మంచి ఫ్యామిలీ డ్రామా. తెలుగు ఆడియన్స్ ఎమోషనలీ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ జోనర్ ని చాలా ఇష్టపడతారు. ‘సత్యం సుందరం’ తెలుగులో హోం గ్రౌండ్ లా ఉంటుంది.
తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!