Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Film Celebrity Interviews Karthi Interview For Satyam Sundaram Movie

Karthi: మా అన్న నుంచి అదే బెస్ట్ కాంప్లిమెంట్.. రెమ్యునరేషన్ తగ్గించారు: కార్తీ ఇంటర్వ్యూ

Published Date :September 23, 2024 , 6:50 pm
By Bhargav Chaganti
Karthi: మా అన్న నుంచి అదే బెస్ట్ కాంప్లిమెంట్.. రెమ్యునరేషన్ తగ్గించారు: కార్తీ ఇంటర్వ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Karthi Interview for Satyam Sundaram movie: హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో కార్తి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

సత్యం సుందరం ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది ? కథ ఎలా వుండబోతోంది?
-96 సినిమా తర్వాత డైరెక్టర్ ప్రేమ్ కుమార్ చేస్తున్న సినిమా ఇది. 96 కి చాలా ఫాలోయింగ్ వవుంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా. రెండేళ్ళ క్రితం నా కోసం ప్రేమ్ దగ్గర ఓ కథ వుందని నా ఫ్రెండ్ చెప్పాడు. కానీ ఆయన నాకు చెప్పడానికి భయపడుతున్నారు. నేనే మెసేజ్ చేశాను. అప్పుడాయన ఈ స్క్రిప్ట్ ని చదవమని ఇచ్చారు. స్క్రిప్ట్ ని ఒక అద్భుతమైన నవల రాశారు. మొత్తం చదివాను. చాలా చోట్ల ఆనందంలో కన్నీళ్ళు వచ్చాయి. ఇలాంటి కథ ఎలా రాస్తారని అనిపించింది. నాకు కే విశ్వనాధ్ గారి సినిమాలు ఇష్టం. కానీ ఇప్పుడు అలాంటి కథలు రావడం లేదు. ఈ కథ చదివినప్పుడు అలాంటి ఒక మంచి సినిమా అవుతుందనిపించింది. చాలా రేర్ స్క్రిప్ట్. డిఫినెట్ గా చేయాలనిపించింది. మనలోని చాలా ప్రశ్నలు సమాధానం ఇచ్చే కథ ఇది. అన్నయ్యకి కథ చదవమని చెప్పాను. అన్నయ్యకి చాలా నచ్చింది. నీకు మాత్రమే ఇలాంటి కథలు ఎలా వస్తున్నాయి అన్నారు. ఖచ్చితంగా చేద్దామని చెప్పారు.

Also Read

  • Mowgli : రోషన్ కనకాల కోసం బరిలోకి జూనియర్ ఎన్టీఆర్
  • Srinidhi Shetty: రాగ పాత్రతో మరో ఫేస్ చూపించబోతోంది శ్రీనిధి.. ‘తెలుసు కదా’పై ఆసక్తికర కామెంట్స్‌!
  • Saif Ali Khan : నాపై దాడి కొందరికి నాటకమైంది.. అసహనం వ్యక్తం చేసిన సైఫ్
  • TG Vishwaprasad : ‘మిరాయ్‌’ ఫాంటసీ విజువల్ వండర్..అయినా అందుకే టికెట్ రేట్లు పెంచలేదు

-బ్రదర్స్ లాంటి రెండు క్యారెక్టర్స్ మధ్యనడిచే కథ ఇది. ప్రతి ఒక్కరూ చూడాలనుకునే సినిమా. అరవింద్ స్వామి గారు ఇందులో క్యారెక్ట కి ర్ పర్ఫెక్ట్. ఆయన చదివి చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ కథని చదివినవారంతా ప్రాజెక్ట్ లో పార్ట్ అవ్వాలని ఆసక్తి చూపారు. 96లానే ఇది ఒక్క నైట్ లో జరిగే కథ. ఫ్యామిలీ ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. సాగర సంగమం సినిమా చూసినప్పుడు ఎలాంటి ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుందో సత్యం సుందరంలో కూడా లాంటి ఓ మంచి అనుభూతిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. విశ్వనాథ్ గారి సినిమాలు కమర్షియల్ బ్లాక్ బస్టర్సే. ఇది కూడా అలాంటి సినిమానే.

ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న కోర్ ఎలిమెంట్ ఏమిటి ?
-అన్ కండీషనల్ లవ్. మనకి ఫ్యామిలీ నుంచే అన్ కండీషనల్ లవ్ దొరుకుతుంది. అలాంటి అన్ కండీషనల్ లవ్ ని చూపించే సినిమా ఇది. మన కల్చర్, రూట్స్ కి సంబధించిన స్టొరీ .

-చాలా మంచి హ్యుమర్ ఫీలింగ్ వున్న ఎమోషనల్ కంటెంట్. చాలా చోట్ల హ్యాపీ టియర్స్ వస్తాయి. ఊపిరి సినిమా చూసినప్పుడు చాలా బ్యూటీఫుల్ ఎమోషన్ వుంటుంది కదా.. అలాంటి హ్యాపీ ఎమోషన్ వున్న కథ.

-ఇలాంటి కథ అరవింద్ స్వామీగారి నిజ జీవితంలో జరిగిందని తెలిసి చాలా సర్ ప్రైజ్ అయ్యాను. ఆయన గ్రామంలోనే పుట్టి పెరిగారు. ఈ సినిమాలో అరవింద్ గారి క్యారెక్టర్ లో ఆయన్ని తప్పితే మరొకని ఊహించలేం. మా క్యారెక్టర్ మధ్య చాలా మంచి కెమిస్ట్రీ వుంటుంది.

తెలుగులో కంటే తమిళ్ ఒక రోజు ముందు రావడానికి కారణం ?
-తెలుగు దేవర వుంది. అది చాలా పెద్ద సినిమా. మా సినిమా రోజు తర్వాత రావడం బెటర్. రెండు చాలా డిఫరెంట్ ఫిలిమ్స్. అది ఒక వార్ లా వుంటుంది. మాది సీతమ్మ వాకిట్లో లాంటి సినిమా(నవ్వుతూ).

మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది?
-ఒక చిన్నపల్లెటూరిలో శారీ షాప్ నడిపే ఇన్నోసెంట్ లాంటి క్యారెక్టర్. తనకి లైఫ్ మీద ఎలాంటి అంచనాలు వుండవు. చాలా చలాకీగా మాట్లాడే క్యారెక్టర్. చాలా సింపుల్ అండ్ బ్యూటీఫుల్ క్యారెక్టర్.

గోవింద్ వసంత మ్యూజిక్ గురించి ?
-గోవింద్ వసంత మంచి కంపోజర్. ఈ కథ విని.. ఈ సినిమా నా ట్యాలెంట్ ని ఛాలెంజ్ చేస్తుందని అన్నారు. ప్రతి సాంగ్ మీనింగ్ ఫుల్ గా వుంటుంది. నేపధ్య సంగీతం హంటింగ్ గా వుంటుంది. మ్యూజిక్ మన చైల్డ్ డేస్ కి తీసుకెళుతుంది.

-ఇందులో డైలాగులు కూడా కొత్తగా నేచురల్ గా వుంటాయి. కెమరామూమెంట్స్ కూడా చాలా ఆర్గానిక్ గా వుంటాయి. ఒక లైఫ్ లా కనిపిస్తుంది. రియల్ ఎమోషన్స్ ని ఆడియన్స్ తెరపై ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా చూస్తే ఇంకా ఆస్వాదిస్తారు.

ప్రేమ్ కుమార్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-ఆయన చాలా ప్లానింగ్ తో వుండే డైరెక్టర్. ప్రతిది రెడీగా ఉంచుతారు. ఆయనకి గొప్ప అండర్ స్టాండింగ్ వున్న డైరెక్టర్. అద్భుతమైన మాటలు రాశారు. ఈ కథ చదివినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉండేదో యాక్ట్ చేసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది.

సూర్య గారు ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్ అయ్యార ?
-సినిమా ప్రోడ్యుస్ చేయడం వరకే కానీ అన్నయ్య ఇన్వాల్ అవ్వరు. ఒక రోజు మాత్రం రాత్రి షూటింగ్ కి రోలెక్స్ వచ్చారు(నవ్వుతూ). అందరికీ తెలిసిపోయి జనం వచ్చేశారు. కాసేపు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ చేశాం.(నవ్వుతూ) మా వాళ్ళే నిర్మాతలు, కొంచెం కమర్షియల్ హంగులు దూరంగా ఉన్న సినిమా కాబట్టి రెమ్యునరేషన్ కొంచెం తట్టించుకోమని చెప్పారు.

-సూర్య నా మొదటి సినిమా చూసి నన్ను హాగ్ చేసుకున్నారు. మళ్ళీ ఈ సినిమా చూసి చాలా ప్రౌడ్ గా హాగ్ చేసుకున్నారు. అద్భుతంగా పెర్ఫార్మ్ చేశానని కాంప్లిమెంట్ ఇచ్చారు.

ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో రిలీజ్ చేయడం గురించి ?
సునీల్ గారు ఈ సినిమా చేయాలని అడిగనప్పుడు చాలా సర్ ప్రైజ్ అయ్యాను. ఆయన రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా వుంది. ఆయన జడ్జ్మెంట్ పై నాకు నమ్మకం వుంది.

డిల్లి, రోలెక్స్ పేస్ అఫ్ ఎప్పుడు ?
-నెక్స్ట్ ఇయర్ వుంటుంది-

స్ట్రయిట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తున్నారు ?
-ఊపిరి తర్వాత తెలుగులో చేయలేదు. కథలు వింటున్నాను. తప్పకుండా చేస్తాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి
సర్దార్ 2 జరుగుతోంది. వా వాతియారే అనే సినిమా వుంది. ఖైదీ 2 నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Karthi Interview
  • Karthi Interview News
  • Satyam Sundaram
  • Satyam Sundaram movie

తాజావార్తలు

  • Rohit Sharma Reaction: జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో భారీ సిక్సర్లు.. తట్టుకోలేని రోహిత్ శర్మ.. ఏం చేసాడంటే.?

  • Trump: హార్ముజ్‌పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • MI vs SRH: వాంఖడేలో హై-స్కోరింగ్ థ్రిల్లర్.. 243 పరుగులు చేసిన ముంబైకి షాకిచ్చిన సన్‌రైజర్స్

  • Astrology: ఏప్రిల్‌ 30, గురువారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని శుభవార్తలు..

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions