Archana Gautham: సినీ నటి అర్చనా గౌతమ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో రచ్చ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్ళింది. అక్కడ బ్రేక్ దర్శనం కోసం టీటీడీ వారికి డబ్బులు చెల్లించినా వారు తనను లోపలికి పంపలేదని,అంతేకాకుండా వారు తనతో తప్పుగా ప్రవర్తించారని చెప్పుకొస్తూ ఒక సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియో లో ఆమె మాట్లాడుతూ “వీఐపీ దర్శనం పేరుతో ఒక వ్యక్తి నుంచి రూ.10500 వసూలు చేస్తున్నారు.
ఇదెక్కడి దోపిడీ.. ఈ దోపిడీని ఆపాలి. నాతో తప్పుగా వ్యవహరించిన టీటీడీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు” ఆమె వీడియోలో తెలిపింది. ఇక ఈ ఘటనపై టీటీడీ సిబ్బంది వాదన మరోలా ఉంది. ఆమె బ్రేక్ దర్శనానికి వచ్చినప్పుడు ఒక పొలిటికల్ లీడర్ రాసిచ్చిన లెటర్ తీసుకొచ్చింది. అందులో డేట్ అయిపోవడంతో బ్రేక్ దర్శనానికి అనుమతి లేదని చెప్పాము. అసలు ఇప్పుడు వీడియో కాదు వినాయక చవితి రోజు జరిగిన ఘటన ఆమె ఇప్పుడు ఈ విషయాన్ని పెద్దది చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇక ఈ సెల్ఫీ వీడియో తీస్తుండగా టీటీడీ సిబ్బంది, అర్చనను అడ్డుకున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. మరి ఇందులో తప్పు ఎవరిది..? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది చూడాల్సి ఉంది.
