‘మా’ ఎన్నికలు ఉద్రిక్తతలు, తోపులాటలు, ఆరోపణలను మధ్య జరుగుతున్నాయి. సినీ స్టార్స్ ఒక్కొక్కరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకూ 300లకు పైగా ఓట్లు నమోదు అయ్యాయి. మరో రెండున్నర గంటల్లో ఓటింగ్ పూర్తి కానుంది. సాయంత్రం నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రికి ఫలితాలు వెల్లడవ్వనున్నాయి. నేటితో ఈ ‘మా’ గొడవలకు, ఘర్షణలకు, ఆరోపణలకు, ప్రత్యారోపణలకు తెర పడనుంది. గెలిచినవారి ఇప్పటికే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారు ? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
Read Also : “మా” ఎలక్షన్స్ : నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య తీవ్ర వాగ్వివాదం
ఇక ఇప్పటికే ఎన్నికల కేంద్రం వద్ద ప్రకాష్ రాజ్, నరేష్ మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. ఇప్పటివరకూ మీడియా ముఖంగా, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న ప్రకాష్ రాజ్, నరేష్ ఈరోజు ‘మా’ ఎన్నికల కేంద్రం వద్ద వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారు. మరోవైపు సమీర్, శివబాలాజీ సైతం ఘర్షణకు దిగారు. సమీర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నాడు అంటూ శివబాలాజీ ఆరోపించగా, సమీర్ సైతం అతనిపై విరుచుకుపడ్డాడు. ఇద్దరికీ ఇరు వర్గాల సభ్యులు సర్ది చెప్పారు.
