Site icon NTV Telugu

Waltair Veerayya: శృతి హాసన్ కి అందం ఎక్కువ, చిరూకి తొందరెక్కువ

Waitair Veerayya

Waitair Veerayya

జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారంలోకి మారి ‘వాల్తేరు వీరయ్య’గా ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. రీఎంట్రీ తర్వాత చిరుని సరైన మాస్ రోల్ లో చూడలేదు, వింటేజ్ చిరు కనిపించట్లేదు అనుకునే వారికి ఫుల్ మీల్స్ పెట్టే రేంజులో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తెరకెక్కింది. దర్శకుడు బాబీ స్వతహాగా మెగా ఫ్యాన్ అవ్వడంతో… మెగా అభిమానులకి సాలిడ్ గిఫ్ట్ అవ్వడానికే సినిమా తీసాను అన్నట్లు రెండున్నర గంటల పాటు ఫ్యాన్ మూమెంట్స్ ని లోడ్ చేసి పెట్టాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం భారి అంచనాలు ఉన్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రమోషన్స్ కి మరింత కిక్ ఇస్తూ మేకర్స్ ఈ మూవీ నుంచి 5వ పాటని రిలీజ్ చెయ్యబోతున్నారు.

Read Also: Rashmika Mandanna: అరెరే రష్మికకు ఎంత కష్టం వచ్చింది.. పాపం

దేవి శ్రీ ప్రసాద్ ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందరెక్కువ’ అనే క్యాచీ లైన్ తో కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని జనవరి 11న ఉదయం 10:35 నిమిషాలకి విడుదల చెయ్యనున్నారు. ఈ సాంగ్ పోస్టర్ లో కూడా చిరు మాస్ లుక్ లోనే కనిపించడం విశేషం. శేఖర్ మాస్టర్ ఖోరియోగ్రఫి చేసిన ఈ మెలోడి సాంగ్ ఆడియన్స్ ని సీట్లలో కూర్చోనివ్వదట. ఫ్రాన్స్ లోని ఒక సిటీలో ఉన్న బ్యూటిఫుల్ లోకేషన్స్ లో ఈ ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందరెక్కువ’ సాంగ్ ని షూట్ చేశారు. ఈ సాంగ్ మేకింగ్ వీడియోని చిరు ఆల్రెడీ లీక్ చేసి సాంగ్ ఎలా ఉండబోతున్నాడో హింట్ ఇచ్చేశాడు. మరి ఈ క్లాసు మాసు కలిపి మిక్స్ చేసిన సాంగ్ మెగా అభిమానులని ఎంత ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.

Read Also: Sharukh: #RRR ఆస్కార్ అవార్డుని ఒక్కసారి నన్ను తాకనివ్వండి…

Exit mobile version