నిర్మాత ఏ.ఎన్. బాలాజీ నిర్మాణంలో రూపొందుతున్న సరికొత్త ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫీల్ మై లవ్’. ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు హరి ప్రకాష్ ఎం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ అప్‌డేట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విలక్షణ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్తిబన్ ఈ చిత్రం యొక్క టైటిల్ పోస్టర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
“జీవితంలో ఏ క్షణంలోనైనా ఒక అద్భుతం జరగొచ్చు” అనే ఒక బ్యూటిఫుల్ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నేటి తరం యూత్‌కు కనెక్ట్ అయ్యే రొమాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే ఎమోషన్స్, హిలేరియస్ కామెడీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ హోల్‌సమ్ ఎంటర్టైనర్‌గా రాబోతోంది. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ కూడా పేరుకు తగ్గట్టే చూస్తూనే ఒక మంచి ఫీల్ ఇచ్చేలా డిజైన్ చేశారు. ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విజువల్ పరంగా చాలా రిచ్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పటికే చెన్నై, పుదుచ్చేరిల్లోని అందమైన లొకేషన్లలో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే తన చివరి షెడ్యూల్‌ను ప్రముఖ హిల్ స్టేషన్ మున్నార్‌లో జరుపుకోనుంది. ఈ లొకేషన్స్ సినిమాకు ఒక ప్రత్యేకమైన కలరింగ్ ఇవ్వడమే కాకుండా ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనున్నాయి. సౌత్ నుంచి వస్తున్న ఈ క్యూట్ లవ్ స్టోరీని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

