NTV Telugu Site icon

OTT News: అక్టోబర్ 13న నేరుగా ఓటీటీలోకి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనింగ్ వెబ్ ఫిల్మ్

Prema Vimanam

Prema Vimanam

Web Film ‘Prema Vimanam’ Streaming In ‘ZEE5’ From October 13th: ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5 ఒరిజినల్స్ సంయుక్తంగా ‘పేమ విమానం’ అనే వెబ్ ఫిల్మ్ తెరకెక్కించారు. ఇక ఇప్పటికే రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది.ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనింగ్ వెబ్ ఫిల్మ్ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. విమానం ఎక్కాలని కలలు కనే ఇద్దరు చిన్న పిల్లలు, కొత్త జీవితం కోసం విమానం ఎక్కి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకునే ప్రేమ జంట వీరితో ముడిపడిన జీవితాల్లో జరిగిన ఘటనలు వారి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా ఒక ఇంట్రెస్టింగ్ కథతో సినిమా తెరకెక్కించారు.

Jabardasth Faima: పట్టుపట్టి సాధించింది.. తలెత్తుకునేలా చేసిన జబర్ధస్త్ ఫైమా

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ సినిమా ఆసక్తి రేపగా సినిమా కోసం ఆడియన్స్ ఎదురు చూస్తునాన్రు. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా నటించడం గమనార్హం. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ ఫిల్మ్‌కి సంతోష్ దర్శకత్వం వహించగా అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా పని చేసిన ఈ సినిమా కొన్నాళ్ల నుంచే అందరిలో ఆసక్తి రేకెత్తించింది. ఇక తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలి తదితర భాషల్లో ఉన్న గొప్ప కంటెంట్‌ను జీ5 నిత్యం ఆడియెన్స్‌కు అందిస్తూనే ఉండగా ఇప్పుడు అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి ‘ప్రేమ విమానం’ అనే వెబ్ ఫిల్మ్‌ను రూపొందించింది.

Show comments