NTV Telugu Site icon

Malaylam Hits: నాలుగు వారాల్లో నాలుగు బ్లాక్‌బస్టర్లు.. మల్లూవుడా మజాకా!

Malayalam Blockbusters

Malayalam Blockbusters

February Malayalam Movies are Back to Back Blockbusters: టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాల సందడి తగ్గింది. తమిళ్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.దానికి తగ్గట్టే ఫిబ్రవరి అంటే అన్ సీజన్ కావడంతో ఈ టైం లో హిట్ కొట్టే సినిమాలు చాలా తక్కువ. అయితే ఇదే సీజన్లో వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇస్తోంది మల్లూవుడ్. నాలుగు వారాల్లో నాలుగు సూపర్ హిట్ సినిమాలని ఆడియన్స్ కి అందించింది. ఈ ఫిబ్రవరిలో మలయాళ సినిమాల డ్రీమ్‌ రన్‌ నడుస్తోంది.ఈ నెల ఫస్ట్ వీక్ టొవినో థామస్‌ థ్రిల్లర్‌ మూవీ అన్వేషిప్పిన్‌ కండేదుం రిలీజై మంచి టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా సూపర్‌ హిట్‌ దిశగా అడుగులేస్తున్న టైంలోనే రెండో వారం ప్రేమలు మూవీ రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. విడుదలై 20 రోజులకు దగ్గర పడుతున్నా హౌస్‌ ఫుల్స్‌తో రన్‌ అవుతోంది. హైదరాబాద్‌ లాంటి చోట్ల కూడా ప్రేమలు బాగా ఆడుతోంది. దీంతో దీన్ని తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి మూడో వారంలో రిలీజైన మమ్ముట్టి సినిమా భ్రమయుగం బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది.

Tapsee Pannu: ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన సొట్ట బుగ్గల సుందరి

ఈ సినిమాకు హౌస్‌ ఫుల్స్‌ పడుతున్నాయి. ఇది కూడా బ్లాక్‌బస్టరే అని తేలిపోయింది. తెలుగులో మాత్రం పెద్దగా ఆడలేదు. అయితే ఈ మూడు సినిమాలు బాగా మలయాళంలో బాగా ఆడుతుండగా.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ మలయాళ ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. అదే మంజుమ్మెల్ బాయ్స్, చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లేటెస్ట్ మూవీ ఫిబ్రవరి 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ షో నుంచే విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ డే 4 కోట్లు, రెండో రోజు 5 కోట్లు వసూళ్లు చేసిందంటే ఎంతలా నచ్చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా కూడా ప్రేమలు మాదిరిగా 50 కోట్లకు పైగా వసూళ్లు చేయడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి అన్‌ సీజన్‌ అయిన ఫిబ్రవరిలో ఒక భాషలో నాలుగు వారాల్లో నాలుగు బ్లాక్‌బస్టర్లు రావడం సినీ పెద్దల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది.